Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్‌

స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా(Rakesh Jhunjhunwala) ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన గతంలో ఓ బాలీవుడ్‌(Bollywood) పాటకు చేసిన నృత్యానికి సంబంధించిన...

Published : 15 Aug 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా(Rakesh Jhunjhunwala) ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన గతంలో ఓ బాలీవుడ్‌(Bollywood) పాటకు చేసిన నృత్యానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆయన వీల్‌ఛైర్‌లో కూర్చోని హుషారుగా కాలుకదుపుతున్నట్లు అందులో కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ ట్విటర్‌ వేదికగా దాన్ని పంచుకుంటూ.. ‘అప్పటికే ఝున్‌ఝున్‌వాలా రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. డయాలసిస్‌ చేయించుకునేవారు. ఈ వీడియోలో ఆయన్ను చూస్తుంటే మరణం కూడా చిన్నబోయేలా ఉంది. పరిస్థితులేమైనా.. జీవించాలన్న సంకల్పం ఉండాలనే సందేశాన్ని చాటుతోంది' అని రాసుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. కిడ్నీ వ్యాధితోసహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఝున్‌ఝున్‌వాలా కొన్ని వారాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు. అయితే.. ఆదివారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాకేశ్‌ను ‘బిగ్‌ బుల్‌’, ‘వారెన్‌ బఫేట్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తుంటారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని