Andhra News: ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా ధైర్య సాహసాలు.. సిక్కోలు అమ్మాయికి ప్రశంసలు

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన కూనుబిల్లి తేజశ్వని ధైర్య సాహసాలను రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకుర

Updated : 08 Aug 2022 08:07 IST

జి.సిగడాం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన కూనుబిల్లి తేజశ్వని ధైర్య సాహసాలను రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకుర రైల్వేస్టేషన్‌లో ఆమె ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా గత మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం రైలు కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ప్రయాణికులను గమనించిన తేజశ్వని వేగంగా పరుగెత్తి పడిపోయిన వారిని కాపాడింది. దీంతో రైల్వే ఉన్నతాధికారులు ఈమెను అభినందించారు. ఆగస్టు 15న సన్మానించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని