పర్యాటక అభివృద్ధిలో రాష్ట్రానికి అవార్డు

ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా (హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ విభాగం) ఆంధ్రప్రదేశ్‌ అవార్డు సాధించింది. పర్యాటక రంగం అభివృద్ధిలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, విభాగాలకు

Published : 28 Sep 2022 05:17 IST

ఈనాడు, దిల్లీ: ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా (హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ విభాగం) ఆంధ్రప్రదేశ్‌ అవార్డు సాధించింది. పర్యాటక రంగం అభివృద్ధిలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, విభాగాలకు 2018-19 సంవత్సరానికి సంబంధించిన అవార్డులు అందజేశారు. కొవిడ్‌ నేపథ్యంలో గత రెండేళ్లుగా అవార్డుల ప్రదానోత్సవం నిలిచిపోయింది. పర్యాటక రంగం సమగ్రాభివృద్ధిలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు మధ్య పోటీ(హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌)లో ఆంధప్రదేశ్‌ తొలి స్థానంలో నిలవగా, కేరళ, గోవా.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. సముద్ర తీర పర్యాటకానికి సంబంధించి బీచ్‌ల చిత్రాలు, సమాచారంతో ఏపీ పర్యాటక శాఖ రూపొందించిన కాఫీ టేబుల్‌ బుక్‌, ..రష్యన్‌, స్పానిష్‌, జర్మన్‌ భాషల్లో ఏపీ పర్యాటక శాఖ రూపొందించిన కాఫీ టేబుల్‌బుక్‌లకు ఉత్తమ సమాచార విభాగంలో అవార్డులు దక్కాయి. ఉత్తమ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ విభాగంలో విజయవాడ గేట్‌ వే హోటల్‌కు ద్వితీయ పురస్కారం దక్కింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రి అజయ్‌ భట్‌ చేతుల మీదుగా అవార్డులను రాష్ట్ర పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, విజయవాడ గేట్‌ వే హోటల్‌ ప్రతినిధులు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని