ఇంట్లో ఉండే ఫోరంలో కేసు వేయొచ్చు

‘రాష్ట్ర వాసులు తమ ఇళ్ల నుంచే వినియోగదారుల ఫోరంలో ఆన్‌లైన్‌ ద్వారా కేసులు దాఖలు చేయొచ్చు. వస్తువును ఎక్కడ కొన్నా, దాని నాణ్యత బాగా లేకపోతే ఎక్కడ నుంచి కేసు వేయడానికైనా కొత్త చట్టం వీలు కల్పిస్తుంది.

Updated : 25 Nov 2022 06:37 IST

మంత్రి కారుమూరి వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర వాసులు తమ ఇళ్ల నుంచే వినియోగదారుల ఫోరంలో ఆన్‌లైన్‌ ద్వారా కేసులు దాఖలు చేయొచ్చు. వస్తువును ఎక్కడ కొన్నా, దాని నాణ్యత బాగా లేకపోతే ఎక్కడ నుంచి కేసు వేయడానికైనా కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. గ్రామ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు విధానంలోనూ కేసు విచారణకు హాజరు కావొచ్చు. వినియోగదారుల ముంగిటకే సేవలను తీసుకెళ్లేందుకు ఈ ఏర్పాట్లు చేశాం’ అని పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. 2018 తర్వాత గురువారం రాష్ట్ర వినియోగదారుల మండలి సమావేశం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వినియోగదారులు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా రెండు టోల్‌ ఫ్రీ నంబర్లను (1967, 18004250082) అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. డిసెంబరు 24న వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కల్తీ నిరోధానికి ప్రస్తుతం విశాఖలో ఉన్న పరిశోధన కేంద్రం పాత బడిందని, దాన్ని పునరుద్ధరించడంతో పాటు విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ల్యాబ్‌లు పెడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. పార్టీ ఇన్‌ఛార్జుల మార్పు నిరంతర ప్రక్రియ అని కారుమూరి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని