చక్కని నారు.. చిటికెలో నాటు!

కలుపు మొక్క అనేదే కనిపించకుండా... క్రమపద్ధతిలో పెరుగుతున్న ఈ వరి నారు నర్సరీలోనిది.

Published : 05 Dec 2022 03:28 IST

కలుపు మొక్క అనేదే కనిపించకుండా... క్రమపద్ధతిలో పెరుగుతున్న ఈ వరి నారు నర్సరీలోనిది. వరి నారు నర్సరీల్లో పెంచడమేంటని ఆశ్చర్యపోతున్నారా..! నాటు వేసేందుకు కూలీలు దొరక్క నర్సరీల్లో పెంచిన నారును ఉపయోగించి యంత్రాలతో నాటు వేయిస్తున్నారు రైతులు. అందుకే.. నర్సరీల నిర్వాహకులు నాటు సమయానికి అందించేలా నారు పోశారు. మిషన్‌ నారుగా పిలిచే దీన్ని ప్లేట్లలో ఓ క్రమపద్ధతిలో, తుంపర పద్ధతిలో నీరందిస్తూ పెంచుతున్నారు. ఇలా పెంచడం వల్ల ఒక్కో మొక్కను యంత్రాలు సులువుగా తీసి.. నాటుతాయి. చిత్రంలోని నారు.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి- నాయుడుపేట మార్గంలో జాతీయ రహదారి పక్కన కన్నలి వద్ద ఉన్న నర్సరీలోనిది. మిషన్‌ నాటుతో చాలా తక్కువ సమయంతోపాటు, కూలీల అవసరం ఉండదు, వరిలో పిలకలూ ఎక్కువ వస్తాయని నర్సరీ నిర్వాహకుడు సురేష్‌ తెలిపారు.

ఈనాడు, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని