Bachula Arjunudu: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్యం విషమం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Updated : 31 Jan 2023 07:42 IST

విజయవాడ (కరెన్సీ నగర్‌), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విజయవాడ రమేష్‌ హాస్పిటల్స్‌ సోమవారం రాత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్‌ సాయంతో అన్ని లైఫ్‌ సేవింగ్‌ సపోర్ట్సుతో చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ బాబు, మత్తు వైద్య నిపుణుడు పి.శ్రీనివాస్‌, క్రిటికల్‌ కేర్‌ నిపుణులు డాక్టర్‌ ధరణేంద్ర, నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌, న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ కుమార వేలు, డాక్టర్‌ బాలకృష్ణ, డాక్టర్‌ లక్ష్మీ అనూష పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని