క్లస్టర్‌ వ్యవస్థరద్దు కంచికేనా?

గ్రామ పంచాయతీల్లో క్లస్టర్‌ వ్యవస్థను రద్దు చేసి మళ్లీ పాత విధానంలో పంచాయతీకో రెగ్యులర్‌ కార్యదర్శిని నియమించాలన్న ప్రతిపాదనలు వెనక్కి వచ్చాయి.

Published : 22 Mar 2023 05:08 IST

ప్రతిపాదనలు వెనక్కి

ఈనాడు, అమరావతి: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్‌ వ్యవస్థను రద్దు చేసి మళ్లీ పాత విధానంలో పంచాయతీకో రెగ్యులర్‌ కార్యదర్శిని నియమించాలన్న ప్రతిపాదనలు వెనక్కి వచ్చాయి. రెండు, మూడు పంచాయతీలు ప్రస్తుతం ఒక క్లస్టర్‌గా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఐదు పంచాయతీలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో ఒకరి నుంచి నలుగురి వరకు రెగ్యులర్‌ కార్యదర్శులు పరిపాలన బాధ్యతలు చూస్తున్నారు. ఒక కార్యదర్శి రెండు, మూడు పంచాయతీల బాధ్యత నిర్వర్తించడంతో ప్రజలకు సేవల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని దృష్ట్యా పంచాయతీకో రెగ్యులర్‌ కార్యదర్శిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వమే చెప్పింది. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబరులో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. వివిధ దశల తర్వాత ఈ ఏడాది జనవరిలో సంబంధిత మంత్రి పరిశీలనకు అధికారులు పంపారు. ఆయన తాజాగా వెనక్కి పంపారు. మంత్రి వ్యక్తం చేసిన అభ్యంతరాలు, సందేహాలేమిటనేది తెలియాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు