బావిలో పైపులు.. బాధలకు తార్కాణాలు!

పల్నాడు జిల్లా వెల్దుర్తి ప్రాంతంలో తాగునీటి సమస్యకు ఈ చిత్రం అద్దంపడుతుంది. ఈ ప్రాంతంలో వేయి అడుగుల దిగువకు వెళితేనే గాని నీటి జాడలు కనిపించవు.

Updated : 30 Sep 2023 08:56 IST

పల్నాడు జిల్లా వెల్దుర్తి ప్రాంతంలో తాగునీటి సమస్యకు ఈ చిత్రం అద్దంపడుతుంది. ఈ ప్రాంతంలో వేయి అడుగుల దిగువకు వెళితేనే గాని నీటి జాడలు కనిపించవు. వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో ఊరికి మధ్యనున్న బావి వద్ద మోటారు పెట్టుకొని అక్కడి నుంచి నీటి సరఫరాకు ఇంటి వరకు పైపులు అమర్చుకున్నారు స్థానికులు. ఏటా వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ ఏడాది వర్షాకాలంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది.

ఈనాడు-గుంటూరు, న్యూస్‌టుడే-వెల్దుర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని