స్థ‌లం కొనేముందు గ‌మ‌నించాల్సిన‌ 5 విష‌యాలు

చాలా మంది ఇంటి నిర్మాణానికి స్థ‌లం కొనుగోలు చేయాల‌ని ఆలోచ‌న చేస్తుంటారు. అయితే దీనికి ముందు కొన్నివిష‌యాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. ఇంటి కొనుగోలు కంటే స్థ‌లం కొనే విష‌యంలో కొంచెం ఎక్కువ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఈ క‌థ‌నంలో స్థ‌లం కొనుగోలు చేసే ముందు మ‌దుప‌ర్లు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను తెలుసుకుందాం.....

Updated : 02 Jan 2021 17:08 IST

చాలా మంది ఇంటి నిర్మాణానికి స్థ‌లం కొనుగోలు చేయాల‌ని ఆలోచ‌న చేస్తుంటారు. అయితే దీనికి ముందు కొన్నివిష‌యాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. ఇంటి కొనుగోలు కంటే స్థ‌లం కొనే విష‌యంలో కొంచెం ఎక్కువ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఈ క‌థ‌నంలో స్థ‌లం కొనుగోలు చేసే ముందు మ‌దుప‌ర్లు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను తెలుసుకుందాం.

1. స్థ‌లం మీకు విక్ర‌యించే వారి పేరు మీద ఉందా?

స్థ‌లం కొనుగోలు చేసేట‌పుడు ఆ స్థ‌లం మీకు విక్ర‌యించే స‌ద‌రు వ్య‌క్తి పేరు మీద ఉందో లేదో తెలుసుకోవాలి. కొన్ని సంద‌ర్భాల్లో స్థ‌లం డెవెలెప్ చేసేందుకు కొంత మంది బిల్డ‌ర్లు స్థ‌లం కొనుగోలు చేసి దాన్ని అభివృద్ధి చేసి వ‌చ్చే లాభాల‌ను పంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ సంద‌ర్భంలో స్థ‌లం మీరు కొనుగోలు చేసే వారి పేరు మీద ఉండ‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి ముందు ఆ స్థ‌లం తాలుకా ధృవ ప‌త్రాల‌ను చూసి కొనుగోలు చేయ‌డం మంచిది. బిల్డర్ స్వయంగా ప్లాట్ల పై తనకు చట్టపరమైన హక్కులు ఉన్నాయని స్పష్టంగా చూపించే పత్రాల కోసం అడగండి.

2. ప్రాజెక్టు కోసం బ్యాంక్ నుంచి డెవలపర్ రుణం తీసుకున్నారా?

సాధార‌ణంగా ప్రాజెక్టు ల కోసం బిల్డర్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. చెప్పాలంటే ఇది సానుకూలమైన విష‌య‌మే, ఎందుకంటే అభివృద్ధి నిమిత్తం తీసుకున్న రుణం, స‌దరు బిల్డ‌ర్ వ‌ద్ద కొంత డబ్బు ఉంద‌ని మ‌నం అనుకోవ‌చ్చు. దీంతో బిల్డర్ కొనుగోలు దార్లు చెల్లించే డబ్బుపై పూర్తిగా ఆధారపడి లేర‌ని తెలుస్తుంది. ప్రాజెక్ట్ నిర్వ‌హ‌ణ‌కు కావ‌ల్సిన డ‌బ్బు ఉంటుంది కాబ‌ట్టి న‌గ‌దు స‌మ‌స్య ఏర్ప‌డ‌ద‌ని భావించ‌వ‌చ్చు. అయితే అన్ని సంద‌ర్భాల్లో ప్రాజెక్టు అబివృద్ధికి బిల్డ‌ర్లు బ్యాంకు రుణాన్ని తీసుకోక పోవ‌చ్చు. అయితే దాని గురించి కొనుగోలు దార్లు ముందుగా తెలుసుకోవ‌డంమంచిది. బ్యాంకులు చట్ట ప‌రంగా , చట్టబద్దమైన ధృవీకరణ క‌లిగిన ప్రాజెక్టుల‌కు మాత్ర‌మే రుణాలు ఇస్తుంటాయి.

3.వ్య‌వ‌సాయేత‌ర భూమేనా ( నాన్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ లాండ్)?

మ‌న దేశంలో ఉన్న అన్ని భూములు వ్యవసాయ క్షేత్రభూమి ప‌రిమితిలోకి వ‌స్తుంటాయి. చ‌ట్ట‌ప‌రంగా ప్ర‌భుత్వం ఇతర ప్రయోజనాల కోసం అనుమ‌తి ఇస్తే వాటిని వ్య‌వ‌సాయేతర కార్య‌క‌లాపాల‌కు వినియోగించ‌చ్చు. కాబట్టి మీరు కొనుగోలు చేసే భూమి వ్యవసాయ భూమా లేదా వ్యవసాయేతర భూమా ముందుగా తెలుసుకోవాలి. వ్యవసాయం కాకుండా ఇత‌ర కార్య‌క‌లాపాల‌కు వినియోగించుకునేందుకు దీనిని ముందు వ్య‌వ‌సాయేత‌ర‌( నాన్ -అగ్రిక‌ల్చ‌ర్‌)భూమి గా మార్చాలి.

నాన్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ల్యాండ్ గా మార్చిన‌ట్ట‌యితే కమర్షియల్, గిడ్డంగులు, రిసార్ట్, ఐటీ, రెసిడెన్షియల్ వంటి వివిధ రకాలైన ప్రాజెక్టులు చేప‌ట్టేందుకు అవ‌కాశం ఉంది. రిసార్ట్ కోసం నిర్ణ‌యించిందైతే, అక్కడ రిసార్ట్ ను మాత్ర‌మే నిర్మించాలి. గిడ్డంగి స్థ‌లంగా మారిస్తే అక్కడ ఒక వాణిజ్య గిడ్డంగిని మాత్ర‌మే నిర్మించాలి. ఇంటిని నిర్మించేందుకు అవ‌కాశం లేద‌ని గ‌మ‌నించాలి. కాబ‌ట్టి స్థలం కొనుగోలు చేసేముందు ఆ ప్లాట్ ఏ కేట‌గిరీలోకి వ‌స్తుందో య‌జ‌మానిని అడిగి తెలుసుకోండి. దీనిని రుజువు చేసే ప‌త్రాల‌ను చూపించ‌మ‌ని అడ‌గండి. కొంద‌రు బిల్డ‌ర్లు ప్ర‌క్రియ మ‌ధ్య‌లో ఉంద‌ని త్వ‌ర‌లోనే నాన్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ భూమిగా మారుతుంద‌ని చెబుతుంటారు. అలాంటి సంద‌ర్భాల్లో జాగ్ర‌త్త వ‌హించండి. ఎందుకంటే ఈ ప్ర‌క్రియ పూర్త‌య్యేందుకు కొంత ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం లేక‌పోలేదు.

4. ఎంత స్థ‌లంలో నిర్మాణం చేసేందుకు అవ‌కాశం ఉంది?

ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) గురించి మీరు తెలుసుకోవాలి. ఇది చ‌ట్ట‌ప‌రంగా పాటించాల్సిన నియ‌మం. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఇల్లు నిర్మించడానికి 2000 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసారని అనుకుందాం. 100% ఎఫ్ఎస్ఐఅంటే, మీరు 2,000 చదరపు అడుగుల స్థ‌లంలో గృహాన్ని నిర్మించవచ్చు. ఎఫ్ఎస్ఐ 75% అయితే, మీరు 2,000 చదరపు అడుగుల భూమిపై 1,500 చదరపు అడుగుల ఇంటిని మాత్రమే నిర్మించే వీలుంటుంది.

5. విక్ర‌య ఒప్పందం(సేల్ డీడ్) ఎప్పుడు జరుగుతుంది?

స్థ‌లం కొనుగోలు చేసేందుకు ప్రారంభ చెల్లింపులు (35-40% డ‌బ్బు) చేసే సంద‌ర్బంలో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందాన్నే సేల్ డీడ్ అంటాం. స్టాంప్ డ్యూటీ , రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆ స‌మ‌యంలో చెల్లింపులు జ‌రుగుతాయి. ఒప్పందం చాలామంది కొనుగోలుదారులు తమ పేరు మీద ఫ్లాట్ / ప్లాట్లు రిజిస్టరు అయింద‌ని అనుకుంటారు. కానీ విక్ర‌య ఒప్పందం అనేది కొనుగోలుదారు, విక్రేత మధ్య ఉన్న ఒప్పందం , ప్రారంభంలో ఉన్న విక్రయదారులకు, అమ్మకం దారుడికి మధ్య భవిష్యత్తులో పూర్తి కొనుగోలు ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని తెలుపుతుంది. దీంట్లో లావాదేవీల‌కు సంబంధించిన‌ నియమాలు,షరతులు ఉంటాయి. చెల్లింపులు, చెక్ నంబ‌రుతో పాటు భవిష్యత్తు తేదీలు, మీరు ఎంత చెల్లింపులు చేస్తారు త‌దిత‌ర వివ‌రాలు అందులో ఉంటాయి.

6.సేల్ డీడ్ ఎందుకంటే

సేల్ డీడ్ చేసుకునేందుకు స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. ఇది చ‌ట్ట‌ప‌రంగా కొనుగోలు దారునికి, విక్ర‌య‌దారునికి జ‌రిగే ఒప్పందం. కాబ‌ట్టి దీని గురించి విక్రేతను వివ‌రంగా అడగండి. స్థ‌లం పూర్తి రిజిస్ట్రేష‌న్ బిల్డ‌ర్ మీ నుంచి మొత్తం డ‌బ్బు పొందినాకే జ‌రుగుతుంది.

చివ‌ర‌గా:

ప్లాట్ల కొనుగోలు ముందు మీరు సమీక్షించుకోవాల్సిన‌ కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే పైన తెలుపబడ్డాయి. బిల్డర్ పూర్వపు ప్రాజెక్టులు, ఇతర చట్టపరమైన అంశాలను తనిఖీ చేయాలి. తెలియని వ్యక్తుల కంటే ప్రముఖమైన బిల్డర్ల నుండి కొనుగోలు చేయడం ఉత్తమం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని