ఎస్‌బీఐ-డెబిట్ కార్డు ర‌హిత నగదు తీసుకోవడం ఎలా?

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే ఇక‌పై డెబిట్‌ కార్డు లేకుండానే న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఇది సాధ్య‌పడుతుంది. యోనో, భార‌త అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌. ఖాతాదారులు త‌మ స్మార్ట్ ఫోన్‌లో యోనో యాప్‌ను ఉప‌యోగించి డిజిట‌ల్ లావాదేవీలు చేయ‌వ‌చ్చు. ..

Published : 18 Dec 2020 14:55 IST

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే ఇక‌పై డెబిట్‌ కార్డు లేకుండానే న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఇది సాధ్య‌పడుతుంది. యోనో, భార‌త అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌. ఖాతాదారులు త‌మ స్మార్ట్ ఫోన్‌లో యోనో యాప్‌ను ఉప‌యోగించి డిజిట‌ల్ లావాదేవీలు చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ యాప్‌ను ఉప‌యోగించి బ్యాలెన్స్ చెకింగ్‌, ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతా తెర‌వ‌డం, ల‌బ్ధిదారుని జోడించడం వంటి సాధార‌ణ బ్యాంకు లావాదేవీలు కూడా చేయోచ్చు.

ఎస్‌బీఐ యోనో యాప్ ఎలా ప‌నిచేస్తుంది?
బ్యాంకు వారు ఇచ్చిన ఇంట‌ర్‌నెట్ లాగ్ఇన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఉప‌యోగించి ఎస్‌బీఐ ఖాతాదారులు యోనో యాప్‌కి లాగ్ఇన్ అవ్వ‌చ్చు. అనంతరం ఆరు అంకెల ఎమ్ పిన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీని ద్వారా భ‌విష్య‌త్తులో సుల‌భంగా లావాదేవీలు నిర్వ‌హించ‌వ‌చ్చు.

యాప్‌కి లాగ్ ఇన్ అయిన అనంత‌రం ఖాతాదారుడు యోనో క్యాష్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఇచ్చిన క్విక్ లింక్స్ ద్వారా సుల‌భంగా యాక్సిస్ చేయోచ్చు. త‌దుప‌రి ఏటీఎమ్ సెక్ష‌న్‌లోకి వెళ్ళి ఏటీఎమ్ నుంచి విత్‌డ్రా చేయాల‌నుకుంటున్న మొత్తాన్ని ఎంట‌ర్ చేయాలి. యాప్ ద్వారా తీసుకునే గ‌రిష్ట మొత్తం రూ.10 వేలు.

మీ రిజిస్ట‌ర్ మోబైల్ నెంబ‌రుకు ఎస్‌బీఐ యోనో క్యాష్ ట్రాన్‌షేక్ష‌న్‌ నెంబ‌రును పంపిస్తారు. ఈనెంబ‌రు, ఖాతాదారుడు ఏర్పాటు చేసుకున్న ఎమ్ పిన్‌ నెంబ‌రు రెండింటిని ఉప‌యోగించి న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఈ నెంబ‌రు నాలుగు గంట‌ల పాటు మాత్ర‌మే ప‌నిచేస్తుంది.

వినియోగ‌దారుడు ఏటీఎమ్ వ‌ద్ద ముందుగా కార్డు ర‌హిత లావాదేవీల‌ను ఎంపిక చేసుకోవాలి. తరువాత యోనో క్యాష్‌ను ఎంచుకుని వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. కార్డు ర‌హిత న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే సర్వీసు అందిస్తున్న ఏటీఎంలకు ‘యోనో క్యాష్ పాయింట్స్’ అని ఎస్‌బీఐ నామకరణం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని