మెప్పించిన ఐఓబీ

ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) రూ.212.87 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Updated : 10 Feb 2021 08:25 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) రూ.212.87 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంక్‌ రూ.6,075.49 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.148.14 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షా త్రైమాసికంలో మొండి బకాయిలు, కేటాయింపులు తగ్గడంతో నికర లాభం పెరిగిందని బ్యాంక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. మొత్తం ఆదాయం కూడా రూ.5,197.94 కోట్ల నుంచి రూ.5,786.51 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 17.12 శాతం (రూ.23,773.86 కోట్ల) నుంచి 12.19 శాతానికి (రూ.16,753.48 కోట్లకు) దిగొచ్చాయి. నికర ఎన్‌పీఏలు కూడా 5.81 శాతం (రూ.7,087.09 కోట్లు) నుంచి 3.13 శాతానికి (రూ.3,904.92 కోట్లు) పరిమితమయ్యాయి. మొండి బకాయిలు, ఆకస్మిక నిధికి కేటాయింపులు రూ.6,663.94 కోట్ల నుంచి రూ.1,513.57 కోట్లకు తగ్గాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని