ఏపీఎల్‌ హెల్త్‌కేర్‌ కిందకు నెల్లూరు యూనిట్‌

నెల్లూరు జిల్లాలోని ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్‌)లో ఉన్న అరబిందో ఫార్మాకు చెందిన తుది ఔషధాల (ఫార్ములేషన్లు) తయారీ యూనిట్‌ను ఏపీఎల్‌ హెల్త్‌కేర్‌ పేరుతో ఏర్పాటు చేసిన సబ్సిడరీ

Published : 02 Mar 2021 01:57 IST

అరబిందో ఫార్మా నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: నెల్లూరు జిల్లాలోని ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్‌)లో ఉన్న అరబిందో ఫార్మాకు చెందిన తుది ఔషధాల (ఫార్ములేషన్లు) తయారీ యూనిట్‌ను ఏపీఎల్‌ హెల్త్‌కేర్‌ పేరుతో ఏర్పాటు చేసిన సబ్సిడరీ కంపెనీ కిందకు మార్చనున్నారు. ఇందుకు అరబిందో ఫార్మా డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ లావాదేవీ విలువ దాదాపు రూ.1091 కోట్లు. అలాగే లైఫస్‌ ఫార్మా అనే మరొక అనుబంధ కంపెనీని అరబిందో యాంటీబయాటిక్స్‌ అనే మరొక అనుబంధ కంపెనీ కిందకు, కూలే ఫార్మా అనే మరొక అనుబంధ కంపెనీని అరబిందో యాంటీబయాటిక్స్‌కు మారుస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని