బుల్‌@61,000

ఈ సారి బడ్జెట్‌ ఎఫెక్ట్‌ స్టాక్‌ మార్కెట్‌పై దీర్ఘకాలం సానుకూల ప్రభావం చూపనుంది. ఈ విషయాన్ని గ్లోబెల్‌ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ వెల్లడించింది. ఈ  సంస్థ సవరించి వెలువరించిన అంచనాల ప్రకారం డిసెంబర్‌ నాటికి సెన్సెక్స్‌ 61,000 వేలకు చేరుకోవచ్చని పేర్కొంది.

Published : 03 Feb 2021 15:50 IST

 మోర్గాన్‌ స్టాన్లీ అంచనా..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సారి బడ్జెట్‌ ఎఫెక్ట్‌ స్టాక్‌ మార్కెట్‌పై దీర్ఘకాలం సానుకూల ప్రభావం చూపనుంది. ఈ విషయాన్ని గ్లోబెల్‌ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ వెల్లడించింది. ఈ  సంస్థ సవరించి వెలువరించిన అంచనాల ప్రకారం డిసెంబర్‌ నాటికి సెన్సెక్స్‌ 61 వేలకు చేరుకోవచ్చని పేర్కొంది.  ‘‘ఈ బడ్జెట్‌లో పెరిగిన మూలధన వ్యయాలతో భారీ వృద్ధి నమోదవుతుంది.  ద్రవ్యలోటు సానుకూల ప్రభావం చూపుతుంది. కొత్తగా ఆదాయపు పన్నుల్లో మార్పులు లేకపోవడం, వృద్ధికి ఊతం ఇవ్వడం, ప్రభుత్వ ఆస్తుల నుంచి ఆదాయం సృష్టించడానికి సరికొత్త విధానంలో ప్రయత్నాలు చేయడం వంటివి ఈక్విటీ మార్కెట్‌ సెంటిమెంట్‌ను స్థిరంగా కొనసాగించేందుకు దోహదం చేస్తున్నాయి ’’ అని మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషకులు నోట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ బడ్జెట్‌ను కచ్చితంగా అమలు చేస్తే  ఆర్థికవ్యవస్థ బలపడుతుందని.. దీంతోపాటు జీడీపీలో కార్పొరేట్‌ లాభాల వాటా గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది.  
మోర్గాన్‌ స్టాన్లీ మొత్తం మూడు రకాల పరిస్థితులను అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్నట్లే వైరస్‌ పరిస్థితి స్థిరంగా కొనసాగి.. మా అంచనాల ప్రకారం ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటే  సెన్సెక్స్‌ 2022 ఆర్థిక సంవత్సరంలో 32శాతం పుంజుకోవచ్చని పేర్కొంది. ఇక సాధారణ స్థితిలో సెన్సెక్స్‌  కనీసం 55 వేలకు చేరుకోవచ్చు.. అదే బేరిష్‌ మార్కెట్లు  కొనసాగితే మాత్రం 41,000లను చేరుకోవచ్చు. ఇక మార్కెట్లో బుల్‌ హవా కొనసాగితే మాత్రం డిసెంబర్‌ నాటికి 61,000 వేలకు చేరుతుంది.   ఈ స్థాయిలో పెరగాలంటే వైరస్‌ పూర్తిగా కనుమరుగై.. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కోలుకోవాల్సి ఉంటుంది. 

గతంలో మోర్గాన్‌ స్టాన్లీ ప్రకటించిన అంచనాల ప్రకారం.. సాధారణ స్థితిలో సెన్సెక్స్‌ కనీసం 50,000 మార్కును తాకొచ్చని.. బేరిష్‌ మార్కెట్లో మాత్రం 37,000కు వెళ్లవచ్చని భావించారు. ఇక బుల్లిష్‌ మార్కెట్లో మాత్రం 59,000కు చేరుతుందని పేర్కొంది.

ఇవీ చదవండి

అమెజాన్‌ సీఈవోగా తప్పుకోనున్న బెజోస్‌

అమెరికాకు ‘కొవాగ్జిన్‌’ టీకా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని