WhatsApp Payments : వాట్సాప్‌ పేమెంట్స్‌లో త్వరలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌?

తమ ప్లాట్‌ఫామ్‌పై లావాదేవీలను ప్రోత్సహించేలా వాట్సాప్‌ త్వరలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది....

Published : 24 Sep 2021 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ పేమెంట్స్‌ పేరిట ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థని ప్రారంభించిన ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు రానున్నట్లు సమాచారం. తమ ప్లాట్‌ఫామ్‌పై లావాదేవీలను ప్రోత్సహించేలా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తొలుత వాట్సాప్‌ బీటా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉన్నట్లు సమచారం.

అయితే, ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులో ఉంటుందా.. లేక తొలిసారి పేమెంట్‌ చేసేవారికి మాత్రమే వర్తిస్తుందా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దీనిపై వాట్సాప్‌ స్పష్టతనిచ్చే అవకాశం ఉందని వాట్సాప్‌ బీటా తెలిపింది. అయితే, ఈ ఆఫర్‌ కేవలం యూపీఐ పేమెంట్స్‌కి మాత్రమే వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌పై వాట్సాప్‌ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని