Stock market: నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు.. కారణాలివే..

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి....

Published : 17 Dec 2021 09:36 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. అమెరికా ఫెడ్‌ వచ్చే ఏడాది వడ్డీరేట్లను పెంచుతామని ప్రకటించడం, అలాగే బాండ్ల విక్రయాల ద్వారా 30 బిలియన్ డాలర్లు సేకరిస్తామని చెప్పడంతో బంగారానికి డిమాండ్‌ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1800 డాలర్లు దాటింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం ఇప్పుడు మదుపర్లను కలవరపెడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.

ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 244 పాయింట్ల నష్టంతో 57,656 వద్ద.. నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 17,168 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.19 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టైటన్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. 

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని