వాహన ప్రదర్శన- 2022 వాయిదా: సియామ్‌

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రేటర్‌ నోయిడాలో జరగాల్సిన వాహన ప్రదర్శన-2022ను వాయిదా వేస్తున్నట్లు వాహన తయారీ కంపెనీల సంఘం (సియామ్‌) తెలిపింది. ప్రస్తుత కొవిడ్‌-19 పరిణామాలతో పాటు మూడో దశ రావొచ్చన్న అంచనాల ....

Published : 03 Aug 2021 02:16 IST

దిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రేటర్‌ నోయిడాలో జరగాల్సిన వాహన ప్రదర్శన-2022ను వాయిదా వేస్తున్నట్లు వాహన తయారీ కంపెనీల సంఘం (సియామ్‌) తెలిపింది. ప్రస్తుత కొవిడ్‌-19 పరిణామాలతో పాటు మూడో దశ రావొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఈ వాహన ప్రదర్శన జరగడం గమనార్హం.


సంక్షిప్తంగా

* వంట నూనెల దిగ్గజం అదానీ విల్మర్‌ లిమిటెడ్‌ (ఏడబ్ల్యూఎల్‌) రూ.4,500 కోట్ల నిధుల సమీకరణకు తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) వచ్చేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది.

* కొవిడ్‌-19 చికిత్స కోసం వినియోగించే నైట్రిక్‌ ఆక్సైడ్‌ నాసల్‌ స్ప్రేను భారత్‌, ఇతర ఆసియా విపణుల్లో వాణిజ్యీకరించేందుకు కెనడా బయోటెక్‌ సంస్థ శానోటైజ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌తో గ్లెన్‌మార్క్‌ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది.

* భారత్‌లో తయారీ రంగ కార్యకలాపాలు జులైలో పుంజుకున్నాయి. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 55.3 శాతానికి చేరింది. జూన్‌లో ఇది 48.1 శాతంగా ఉంది.

* జాగ్వార్‌ ఎఫ్‌-టైప్‌ ఆర్‌-డైనమిక్‌ బ్లాక్‌ మోడళ్లకు భారత్‌లో బుకింగ్‌లు మొదలుపెట్టినట్లు జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) వెల్లడించింది.

పట్టిక యాడ్‌
ఎంసీఎఫ్‌ 24.32 11.01 687.19 529.79

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని