మ‌హిళ‌లకూ ఆర్థిక ప్ర‌ణాళిక ముఖ్య‌మే.. 

ఆర్థిక విష‌యాల‌కు సంబంధించి మ‌హిళ‌లు స‌రైన ప్ర‌ణాళిక‌ క‌లిగి ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

Updated : 21 Apr 2021 16:23 IST

మ‌హిళ‌ల్లో ఆర్థిక సాధికారికత అనేది స‌మాన‌త్వానికి, జీవితాన్ని అర్ధవంతంగా రూపొందించుకునేందుకు మొద‌టి అడుగుగా చెప్పాలి. ఆర్థిక సాధికారిత ఉన్న మ‌హిళ‌లు తాము కోరుకున్న విధంగా జీవిస్తూ, త‌మ‌ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేసే వారిగా ఉంటారు. మ‌హిళ‌లు త‌మ ఆర్థిక సాధికారిత‌కు త‌ప్ప‌క తీసుకోవాల్సిన కొన్ని జాగ్ర‌త్త‌ల గురించి తెలుసుకుందాం.

జీవిత‌బీమా..
పిల్లలను లేదా పెద్ద‌వారిని చూసుకునే భాద్య‌త క‌లిగి ఉంటే జీవిత బీమా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. ఇది వారి జీవితాల‌కు భ‌రోసా ఇస్తుంది. ఉద్యోగం చేస్తున్న‌వారైతే, ట‌ర్మ్ ప్లాన్ త‌ప్ప‌క తీసుకోవాలి. త‌మ‌పై ఆధారపడిన వారు స్వతంత్రంగా మారే వ‌ర‌కూ వారి భాద్య‌త‌ల‌ను నెర‌వేర్చేందుకు ఒక ప్రణాళిక‌ ఉండాలి. టర్మ్ ప్రణాళికలు అదనపు కవర్లను అందిస్తాయి. తీవ్ర అనారోగ్యం లేదా వ్యక్తిగత ప్రమాద లేదా ప్రమాద వైకల్యానికి అదనపు రైడ‌ర్ల‌ను తీసుకోవాలి. ప్రీమియం మినహాయింపు రైడ‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అద‌న‌పు రైడ‌ర్ల‌ను తీసుకునే ముందు పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అద‌న‌పు రైడ‌ర్ల కోసం  ప్రీమియం కూడా కొంత‌ ఎక్కువగానే‌ చెల్లించాలి. అన‌వ‌స‌రంగా ఎక్కువ రైడ‌ర్ల‌ను తీసుకుని భారీగా ప్రీమియంలు చెల్లించడం వ‌ల్ల , పెట్టుబ‌డి చేసే మొత్తాన్ని త‌గ్గించ‌కూడ‌దు.

ఆరోగ్య బీమా.. 
మ‌హిళ‌లు త‌మ‌కు, త‌మ‌ కుటుంబానికి తగిన వైద్య బీమా కవర్ కలిగివుండటం వల్ల, వైద్య అవసరాల కారణంగా పెట్టుబడుల ప్రణాళిక దెబ్బతినకుండా చూసుకోవ‌చ్చు. ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునేట‌పుడు, మంచి ఆసుపత్రి నెట్వర్క్ కలిగి, వేగంగా క్ల‌యిమ్ సెటిల్ చేసే బీమా సంస్థ‌ను ఎంచుకోవాలి. అవ‌స‌రం ఉంటే క్యాన్సర్, నాడీ సంబంధిత రుగ్మతలు లేదా గుండె సంబంధిత‌ వ్యాధుల కోసం ప్రత్యేక పాల‌సీ లేదా యాడ్-ఆన్ రైడర్లను తీసుకోవాలి.

అత్యవసర నిధి..
అత్యవసర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు కొంత డ‌బ్బును అత్య‌వ‌స‌ర‌నిధిగా ఏర్పాటుచేసుకోవాలి. సాధారంగా ఆరు నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిపోయే మొత్తాన్ని అత్య‌వ‌స‌ర‌నిధిగా ఉంచుకోవాల‌ని నిపుణులు సూచిస్తుంటారు. అత్య‌వ‌స‌ర నిధిని ఉంచుకోవ‌డం వ‌ల్ల త‌మ ల‌క్ష్య ఆధారిత పెట్టుబడులను ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా కొన‌సాగించేందుకు వీల‌వుతుంది. వ్యక్తిగత రుణాన్ని తీసుకోవడాల్సిన అవసరం ఉండ‌దు. ఇతరుల నుంచి డ‌బ్బు సహాయం కోరే అవ‌స‌రం ఏర్ప‌డ‌దు.

ల‌క్ష్యం ఆధారంగా పెట్టుబ‌డి..
స్వల్ప‌, మ‌ధ్య‌, దీర్ఘ‌కాలీక ల‌క్ష్యాల‌ను పెట్టుకోవాలి. మీ పెట్టుబ‌డులు ల‌కక్ష్యాల‌కు అనుగుణంగా ఉండాలి. మ్యూచువ‌ల్ ఫండ్లు, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వేర్వేరు సాధ‌నాల ద్వారా పెట్టాలి. పెట్టుబ‌డులు న‌ష్ట‌భ‌యంతో కూడికుని ఉంటాయి. కాబ‌ట్టి త‌మ న‌ష్ట‌భ‌యం ఆధారంగా స‌రిపోయే పెట్టుబ‌డుల‌ను ఎంపిక చేసుకోవాలి. దీనికి సంబంధించి నిపుణుల స‌ల‌హాలు తీసుకోవ‌డం మంచిది. పెట్టుబ‌డులు, ఆస్తులకు సంబంధించి నామినీల‌ను ఉంచుకోవాలి. విల్లును సిద్ధం చేసి దానిని రిజిస్ట‌ర్ చేసుకోవాలి. మీ కుటుంబ‌స‌భ్యుల‌కు ఈ వివ‌రాల‌ను తెలియ‌జేయాలి ఆదాయం పన్ను రిట‌ర్నుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా దాఖ‌లు చేయండి. మీ పెట్టుబ‌డ‌ల‌కు సంబంధంచి అన్నింటికి కెవైసి నిబంధ‌న‌లు స‌క్రమంగా పాటించారో లేదో త‌నిఖీ చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని