Bank frauds: ₹60 వేల కోట్ల నుంచి ₹600 కోట్లకు తగ్గిన బ్యాంకు మోసాలు!

గత ఐదేళ్లలో బ్యాంకు మోసాలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు....

Published : 14 Mar 2022 21:19 IST

లోక్‌సభలో వెల్లడించిన కేంద్రం

దిల్లీ: గత ఐదేళ్లలో బ్యాంకు మోసాలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల వ్యవధిలో రూ.648 కోట్ల మోసాలు మాత్రమే నమోదైనట్లు వివరించారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ సోమవారం ఆయన ఈ విషయం వెల్లడించారు.

కేంద్రం తీసుకున్న నిర్మాణాత్మక చర్యల వల్లే మోసాలు తగ్గాయని మంత్రి తెలిపారు. 2016-17లో రూ.61,229 కోట్ల విలువ చేసే బ్యాంకు మోసాలు నమోదైనట్లు వెల్లడించారు. అవి 2020-21 నాటికి రూ.11,583 కోట్లు, 2021-22 నాటికి రూ.648 కోట్లకు తగ్గినట్లు వివరించారు. బ్యాంకు మోసాలపై అవగాహన కల్పిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2016లో విస్తృత మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని