ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు సవరించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ రోజు నుంచి తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది.

Published : 17 Mar 2023 15:43 IST

దిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. సాధారణ డిపాజిటర్లు 399 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీపై గరిష్ఠంగా 7.05%, సీనియర్‌ సిటిజన్లు ఇదే కాలవ్యవధి ఎఫ్‌డీపై 7.55% గరిష్ఠ వడ్డీ రేటును పొందుతారు. సాధారణ డిపాజిటర్లు 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీపై 3% కనిష్ఠ వడ్డీ రేటును పొందుతారు. ఒక ఏడాది నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లు 6.75% వడ్డీ,  సీనియర్‌ సిటిజన్లు ఇవే కాలవ్యవధులకు 7.25% వడ్డీ పొందుతారు. 444, 555 రోజుల ప్రత్యేక డిపాజిట్లపై కూడా ఇదే వడ్డీ రేట్లను పొందొచ్చు. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. కొత్త రేట్లు మార్చి 17 నుంచి అమల్లోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని