Adani group: అదానీ గ్రూప్‌నకు రుణాలు కొనసాగుతాయ్: బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్
Adani group: అదానీ గ్రూప్‌నకు రుణాలు కొనసాగుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. అదానీ గ్రూప్ పట్ల ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ (Adani group) కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్లో ఆ గ్రూప్ షేర్లు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీల షేర్లు ఒడుదొడుకులకు లోనవుతునూనే ఉన్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌నకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల గురించీ చర్చ జరిగింది. ఏయే బ్యాంక్ ఆ గ్రూప్‌నకు ఎంత రుణం ఇచ్చిందీ బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌నకు రుణాలు కొనసాగుతాయంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) చీఫ్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చద్దా అదానీ గ్రూప్‌నకు రుణాలు ఇచ్చే అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పూచీకత్తు ప్రమాణాలు సక్రమంగా పాటిస్తే రుణాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. అదానీ గ్రూప్ షేర్లలో ఒడుదొడుకులను తాను పట్టించుకోనని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌నకు ఎంత రుణం ఇచ్చిందీ మాత్రం వెల్లడించలేదు. ముంబయిలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లకు ఈ ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్‌నకు బ్యాంక్ ఆఫ్ బరోడా రుణం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని చద్దా తెలిపారు. కొన్ని పరిమితులకు లోబడే రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. హిండెన్ బర్గ్ షాక్‌తో ఇప్పటికే 500 మిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి అదానీ గ్రూప్ సిద్ధమైన వేళ చద్దా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
50 బిలియన్ దిగువకు అదానీ సంపద
ప్రపంచ కుబేరుల్లో టాప్-3కి వేగంగా ఎదిగిన గౌతమ్ అదానీ సంపద భారీగా క్షీణించింది. ఓ నెల క్రితం 120 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్న అదానీ సంపద విలువ ఇప్పుడు 50 బిలియన్ డాలర్ల దిగువకు (49.1 బిలియన్ డాలర్లు) చేరింది. దీంతో ఈ సూచీలో 25వ స్థానానికి చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 83.6 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Director Teja: నమ్మిన వాళ్లే నన్ను అవమానించారు: తేజ
-
India News
Punjab: డ్రగ్స్ స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం.. 5,500 మంది పోలీసులు.. 2వేల చోట్ల దాడులు!
-
Politics News
Smriti Irnai: మంత్రి మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ!
-
India News
అంబానీ ఇంట వారసురాలు.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్- శ్లోకా దంపతులు
-
General News
AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే