Ola Cabs CEO: పగలు సీఈఓ.. రాత్రి పూట క్యాబ్‌ డ్రైవర్‌!

OLa Cabs new CEO: ఓలా క్యాబ్స్‌కు కొత్త సీఈఓగా హేమంత్‌ భక్షి నియమితులయ్యారు. భవీశ్‌ అగర్వాల్‌ ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు.

Published : 26 Jan 2024 13:40 IST

ఓలా క్యాబ్స్‌ కొత్త సీఈఓ హేమంత్‌ భక్షి, వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌

Ola CEO | ఇంటర్నెట్‌ డెస్క్‌: వినియోగదారుల అభిరుచులు మారుతూ ఉంటాయి. వారి ఇష్టాయిష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తేనే ఏ వ్యాపారమైనా హిట్టయ్యేది. అందుకే వ్యాపారంలో ఉన్న వారు ఎప్పటికప్పుడు కస్టమర్ల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకునేందుకు ఏకంగా క్యాబ్‌ డ్రైవర్‌ అవతారం ఎత్తారు ఓలా క్యాబ్స్‌ కొత్త సీఈఓ హేమంత్‌ భక్షి. ఈ విషయాన్ని తాజాగా ఆయనే బయటపెట్టారు.

ఓలా క్యాబ్స్‌కు కొత్త సీఈఓగా హేమంత్‌ భక్షిని మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ నియమించింది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఆయన యూనిలీవర్‌ ఇండోనేసియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇన్నాళ్లు ఆ పదవిలో కొనసాగిన ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఐఐఎం- అహ్మదాబాద్‌, ఐఐటీ - బాంబే పూర్వ విద్యార్థి అయిన హేమంత్‌ భక్షి నాలుగు నెలల కిందట ఓలాలో చేరారు.

భారత ఈ-కామర్స్‌లో 48% మార్కెట్‌ వాటాతో ఫ్లిప్‌కార్ట్‌ ముందంజ!

ఓలా త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా గురువారం భక్షి మాట్లాడుతూ.. క్యాబ్‌ డ్రైవర్‌గానూ అవతారం ఎత్తిన విషయాన్ని వెల్లడించారు. వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వారాంతాల్లో బెంగళూరు వీధుల్లో రాత్రి పూట క్యాబ్‌ నడిపానని చెప్పారు. అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మించి ఏదీ ఉండదని, అందుకే మూన్‌లైటింగ్‌ చేశానని చెప్పుకొచ్చారు. గతంలో ఉబర్‌ సీఈఓ దారా ఖోస్రోషాహి సైతం ఇలానే కొన్ని నెలల పాటు ఉబర్‌ డ్రైవర్‌గా, డెలివరీ ఏజెంట్‌గా వ్యవహరించారని ఓ సందర్భంలో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు