EPFO: అధిక పింఛను వివరాల అప్‌లోడ్‌కు మరింత గడువు

EPFO: అధిక పింఛను వివరాల అప్‌లోడ్‌కు మరింత గడువు ఇస్తూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 31 వరకు సంస్థలకు అవకాశం కల్పించింది.

Published : 29 Sep 2023 20:36 IST

EPFO | దిల్లీ: అధిక పింఛనుకు ( higher pension option) సంబంధించి వివరాల అప్‌లోడ్‌కు సంస్థలకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) మరింత గడువు ఇచ్చింది. ఉద్యోగుల వేతన వివరాలు అప్‌లోడ్‌ చేసేందుకు గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 31 వరకు అవకాశం కల్పించింది. వాస్తవానికి సెప్టెంబర్‌ 30తో ముగియాల్సి ఉండగా.. ఎంప్లాయర్స్‌ అసోసియేషన్‌ నుంచి వచ్చిన వినతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది.

‘‘అధిక పింఛను ఆప్షన్‌కు సంబంధించి పెన్షన్లు/ మెంబర్లకు వేతన వివరాలు అప్‌లోడ్‌ చేసేందుకు గడువు ఇవ్వాలని ఎంప్లాయర్స్‌ అండ్‌ ఎంప్లాయర్స్‌ అసోసియేషన్‌ నుంచి వినతి అందింది. సెప్టెంబర్‌ 29 నాటికి వ్యాలిడేషన్ ఆఫ్‌ ఆప్షన్‌/ జాయింట్‌ ఆప్షన్‌కు సంబంధించి ఇప్పటికీ 5.52 లక్షల దరఖాస్తులు ఎంప్లాయర్స్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని కార్మిక శాఖ తెలిపింది. 

ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే

అధిక పింఛనుకు సంబంధించి గతేడాది నవంబర్‌ 4న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తొలుత ఉద్యోగులకు అధిక పింఛను దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఫిబ్రవరి 26 నుంచి మే 3 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. తర్వాత జూన్‌ 26 వరకు గడువు పొడిగించారు. ఆపై మరో 15 రోజులు చివరి అవకాశంగా గడువు ఇచ్చారు. జులై 11 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అప్పటి వరకు వ్యాలిడేషన్‌ ఆఫ్‌ ఆప్షన్‌/ జాయింట్‌ ఆప్షన్‌ కోసం మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు అందినట్లు కార్మిక శాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని