ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే

small saving schemes latest interest rates: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటైన ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును కేంద్రం పెంచింది. మిగిలినవి యథాతథంగా కొనసాగించింది.

Published : 30 Sep 2023 01:53 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ -డిసెంబర్‌ (Oct- dec) త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల (small saving schemes) వడ్డీ రేట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్లపై (RD) వడ్డీ రేటును 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. మిగిలిన పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 మధ్య కాలానికి ఈ వడ్డీ రేట్లు వర్తింపజేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అయితే, పీపీఎఫ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పాపులర్‌ పథకాలతో పాటు ఇతర పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చకపోవడం నిరాశ పరిచింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌పై 7.1%, సేవింగ్స్‌ డిపాజిట్‌పై 4.0%, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ 7.7%, సుకన్య సమృద్ధి యోజన 8%, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ 8.2%, కిసాన్‌ వికాస్‌ పత్రపై 7.5%, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌పై 7.4% వడ్డీ లభించనుంది. తాజా వడ్డీ రేట్లలో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌కు అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుండగా.. సేవింగ్స్‌ డిపాజిట్‌కు కనిష్ఠంగా 4.0 శాతం వడ్డీ లభిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు