EPFO Advances: 3 ఏళ్లలో అడ్వాన్సుల రూపంలో రూ.48 వేల కోట్లు

ఈపీఎఫ్‌ఓ గడిచిన మూడేళ్లలో తన చందాదారులకు భారీగా అడ్వాన్స్‌లు ఇచ్చింది. కొవిడ్‌ ఏడాది నుంచి ఇప్పటి వరకు రూ.48 వేల కోట్లు అడ్వాన్సు రూపంలో ఇచ్చింది.

Updated : 20 Nov 2023 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) గడిచిన మూడేళ్లలో చందాదారులకు భారీ మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చింది. 2.2 కోట్ల మందికి రూ.48 వేల కోట్లు అడ్వాన్సుల రూపంలో ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ వార్షిక ముసాయిదా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2020-21లో 69.20 లక్షల లబ్ధిదారులకు రూ.17,106.17 కోట్లను ఈపీఎఫ్‌ఓ పంపిణీ చేసింది. 2021-22లో 91.60 లక్షల లబ్ధిదారులకు రూ.19,126.29 కోట్లను పంపిణీ చేసింది. 2022-23లో 62 లక్షల లబ్ధిదారులకు రూ.11,843.23 కోట్లను అడ్వాన్సుగా ఇచ్చింది. 

IPO ఎఫెక్ట్‌తో దూసుకెళ్లిన టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ స్టాక్స్‌.. ఒక్కో షేరుపై ₹1200 లాభం!

ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌కు ఉన్న మొత్తం చందాదారుల్లో మూడోవంతు చందాదారులు అడ్వాన్సుల రూపంలో లబ్ధి పొందారు. వీరంతా ఈపీఎఫ్‌ఓ అందిస్తున్న కొవిడ్‌ అడ్వాన్స్‌ ద్వారా తమ పదవీ విరమణ మొత్తాన్ని ఉపసంహరించకున్నారు. చాలా వరకు కొవిడ్‌ క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌ఓ మూడు పని దినాల్లో పరిష్కరించింది. ఈపీఎఫ్‌ఓకు 6 కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు. రూ.18 లక్షల కోట్ల కంటే ఎక్కువ కార్పస్‌ను నిర్వహిస్తోంది. కొవిడ్‌ సమయంలో తీసుకొచ్చిన ఈ అడ్వాన్స్‌ సదుపాయం చాలా మంది ఆర్థిక అవసరాల ను తీర్చడంలో తోడ్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని