Facebook: ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయిందా..? రికవరీ సులువుగా ఇలా..!

Recover facebook account: ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందా..? ఖాతాను రికవరీ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ కింది టిప్స్‌ ఫాలో అయిపోండి.

Updated : 10 Oct 2023 19:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కొందరు తమ నైపుణ్యాలకు పదును పెడుతుంటే.. మరికొందరేమో తమ స్వార్థప్రయోజనాలకు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ఇతరుల సోషల్‌మీడియా ఖాతాల హ్యాక్‌ చేసి.. వారి అకౌంట్‌ నుంచి వారికే తెలియకుండా మెసేజ్‌లు పంపిస్తూ డబ్బులు కొందరు దండుకుంటున్నారు. మరికొందరు అసభ్య చిత్రాలు పోస్టు చేస్తుంటారు. ఎవరో చెప్తే గానీ హ్యాక్‌ అయ్యిందన్న విషయం కూడా కొందరికీ తెలీడం లేదు. ఒకవేళ మీకు గానీ, మీకు తెలిసిన వారి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందా? అయితే, ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి. సింపుల్‌గా అకౌంట్‌ను రికవరీ చేసుకోండి. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకున్నారు.

ఆప్షన్‌ 1

  • Facebook.com/hacked అని వెబ్‌బ్రౌజర్‌లో సెర్చ్‌ చేయండి.
  •  స్క్రీన్‌పై కనిపించే డైలాగ్‌ బాక్స్‌లో ‘My Account is Compromised’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  •  ఇ-మెయిల్‌ లేదా మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి మీ ఫేస్‌బుక్‌ ఖాతాను తిరిగిపొందొచ్చు.

ఏటా కొత్త ఐఫోన్‌.. ఎందుకో చెప్పిన టిమ్‌ కుక్‌!

ఆప్షన్‌ 2

  •  ‘Facebook Grievance Officer’  అని వెబ్‌బ్రైజర్‌లో టైప్‌ చేయండి.
  •  ఫేస్‌బుక్‌కు సంబంధించి సెర్చ్‌ రిజల్ట్‌లో వచ్చే ఫస్ట్‌ వెబ్‌పేజ్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  •  గ్రీవియన్స్‌ ఆఫీసర్‌ని ఎలా కాంటాక్ట్‌ అవ్వాలి అని ఓ వ్యాసం కనిపిస్తుంది. అందులో ‘this form’ అని హైలెట్‌ చేసిన టెక్ట్స్‌ను క్లిక్‌ చేయగానే ఫామ్‌లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది.
  •  ‘My account has been hacked’ ,‘I am reporting on behalf of myself/my organisation’ ఈ రెండు ఆప్షన్లు ఎంచుకోవాలి.
  •  మీ పేరు, ఇ-మెయిల్‌.. ఇలా అందులో అడిగిన ఇతర వివరాలు నమోదు చేసి ‘Submit’ చేయాలి.

పై రెండు విధాలుగా ఫిర్యాదు చేసినా ఏ విధమైన చర్యలు తీసుకోకపోతే నేరుగా..‘www.gac.gov.in’ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫిర్యాదు చేయెచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని