హైదరాబాద్‌లో రెండు కొత్త ఐసీఐసీఐ హోమ్‌ ఫైనాన్స్‌ శాఖలు

ఐసీఐసీఐ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ హైదరాబాద్‌లో రెండు కొత్త శాఖలు ప్రారంభించింది. దీంతో తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ సంస్థకు 18 శాఖలు ఉన్నట్లు అవుతోంది.

Published : 09 Dec 2022 03:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఐసీఐసీఐ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ హైదరాబాద్‌లో రెండు కొత్త శాఖలు ప్రారంభించింది. దీంతో తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ సంస్థకు 18 శాఖలు ఉన్నట్లు అవుతోంది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌, ఆర్‌సీ పురంలో కొత్త శాఖలు ప్రారంభించినట్లు ఐసీఐసీఐ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గృహ రుణాలతో పాటు బంగారం తనఖా రుణాలను ఈ శాఖలు జారీ చేస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇళ్ల నిర్మాణం ఎంతో అధికంగా ఉన్నట్లు, ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఐసీఐసీఐ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఎండీ, సీఈఓ అనిరుధ్‌ కమానీ వివరించారు. ఐసీఐసీఐ బ్యాంకుకు అనుబంధ సంస్థే ఈ ఐసీఐసీఐ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని