వాణిజ్య సిలిండర్‌ ధర రూ.85 తగ్గింది

వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు గురువారం ప్రకటించాయి. హైదరాబాద్‌లో ఈ సిలిండర్‌ ధర రూ.85 తగ్గి, రూ.1991కి పరిమితమైంది.

Published : 02 Jun 2023 03:51 IST

హైదరాబాద్‌: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు గురువారం ప్రకటించాయి. హైదరాబాద్‌లో ఈ సిలిండర్‌ ధర రూ.85 తగ్గి, రూ.1991కి పరిమితమైంది. దిల్లీలో రూ.83.50 తగ్గి రూ.1773గా ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినందున, వాణిజ్య సిలిండర్‌ ధరను 7% తగ్గిస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి. ఈ సిలిండర్ల ధరను తగ్గించడం వరుసగా ఇది మూడో నెల. ఏప్రిల్‌లో రూ.91.5, మేలో రూ.171.5 మేర తగ్గించారు. మార్చి1 నాటి ధరతో పోలిస్తే, ఇప్పటివరకు రూ.350 వరకు తగ్గినట్లయ్యింది. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండరు ధరలో మార్పు చేయలేదు.

విమాన ఇంధన ధరా 7% తగ్గింపు: విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరను కూడా 7% మేర చమురు సంస్థలు తగ్గించాయి. దిల్లీలో కిలోలీటరు ఏటీఎఫ్‌ ధర రూ.6632.25 తగ్గి, రూ.89,303.09కి చేరింది. వీటి ధరలు తగ్గించడం వరుసగా ఇది 4వ సారి. ఇప్పటివరకు 4 నెలల్లో కిలోలీటరుకు రూ.23,053 మేర ఏటీఎఫ్‌ ధర తగ్గింది. విమానయాన సంస్థలకు ఇది కలిసొచ్చే అంశమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని