చందాకొచ్చర్‌పై విచారణకు ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు అనుమతి

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ, ఎండీ చందాకొచ్చర్‌పై విచారణ చేపట్టడానికి బ్యాంక్‌ బోర్డు అనుమతి ఇచ్చిందని ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది.

Published : 08 Jun 2023 02:32 IST

కోర్టుకు తెలియజేసిన సీబీఐ

ముంబయి: ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ, ఎండీ చందాకొచ్చర్‌పై విచారణ చేపట్టడానికి బ్యాంక్‌ బోర్డు అనుమతి ఇచ్చిందని ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. వీడియోకాన్‌ గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో మోసం, అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలకు సంబంధించి చందాకొచ్చర్‌పై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ తరఫు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎ. లిమోసిన్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్‌ 22న ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఆ మేరకు ఒక తీర్మానం చేసిందని కోర్టుకు వివరించారు. ఈ కేసు విషయంలో గతేడాది డిసెంబరులో చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు వీరిద్దరికీ మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో వీడియోకాన్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌ను సైతం అరెస్టు చేయగా.. ఆయనకూ మధ్యంతర బెయిలు లభించింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌, ఆర్‌బీఐ మార్గదర్శకాలు, బ్యాంకు రుణ విధానాలను ఉల్లంఘిస్తూ ధూత్‌కు చెందిన వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణాలను ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చిందని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు