Bill Gates: భారత్‌లోకి ‘బిల్‌గేట్స్‌ కంపెనీ’.. హెడ్‌ ఆఫీస్‌ ఎక్కడంటే..?

ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌తో పాటు తయారీ దిగ్గజం హానీవెల్‌ మద్దతు ఉన్న డిజిటల్‌ తయారీ కంపెనీ ఫిక్టివ్‌ భారత్‌లోకి అడుగుపెట్టింది.

Updated : 12 Jul 2023 07:55 IST

బెంగళూరు: ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌తో పాటు తయారీ దిగ్గజం హానీవెల్‌ మద్దతు ఉన్న డిజిటల్‌ తయారీ కంపెనీ ఫిక్టివ్‌ భారత్‌లోకి అడుగుపెట్టింది. బెంగళూరులో ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. పుణెలో ప్రాథమికంగా అడుగుపెట్టి.. వినియోగదార్ల నుంచి సానుకూల స్పందన అందుకున్న అనంతరం.. ఇపుడు అధికారికంగా భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది.

ఇప్పటికే అమెరికా, చైనాల్లో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ భారత్‌ను మూడో తయారీ కేంద్రంగా ప్రకటించింది. ‘పరిశోధన- అభివృద్ధి, తయారీ నైపుణ్యం, సరఫరా వ్యవస్థలకు భారత్‌ కేంద్రంగా మారుతోంద’ని ఈ సందర్భంగా ఫిక్టివ్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దేవ్‌ ఎవాన్స్‌ పేర్కొన్నారు. భారత్‌లో కార్యకలాపాల బాధ్యత నిమిత్తం జనరల్‌ మేనేజర్‌గా ఉదయ్‌ షెనాయ్‌ని కంపెనీ నియమించింది. బిల్‌గేట్స్‌, హానీవెల్‌, ఇంటెల్‌ క్యాపిటల్‌ నుంచి మొత్తం 192 మి. డాలర్ల(దాదాపు రూ.1575 కోట్లు) పెట్టుబడులు వచ్చినట్లు ఫిక్టివ్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని