మదర్‌ స్పర్శ్‌లో ఐటీసీకి 16% వాటా

ఆయుర్వేదిక్‌, సహజసిద్ధ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల బ్రాండ్‌ అయిన మదర్‌ స్పర్శ్‌లో 16 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు ఐటీసీ శుక్రవారం వెల్లడించింది. ఇందుకోసం రూ.20 కోట్లతో షేరు

Published : 27 Nov 2021 03:40 IST

దిల్లీ: ఆయుర్వేదిక్‌, సహజసిద్ధ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల బ్రాండ్‌ అయిన మదర్‌ స్పర్శ్‌లో 16 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు ఐటీసీ శుక్రవారం వెల్లడించింది. ఇందుకోసం రూ.20 కోట్లతో షేరు సబ్‌స్క్రిప్షన్‌ ఒప్పందం చేసుకుంది. వేగంగా వృద్ధి చెందుతున్న డైరెక్ట్‌ టు కన్జూమర్‌ (డీ2సీ) విభాగంలో ప్రవేశించేందుకు ఈ వాటా కొనుగోలు చేసినట్లు ఐటీసీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. మదర్‌ స్పర్శ్‌ ప్రీమియం ఆయుర్వేదిక్‌, సహజ సిద్ధ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల అంకుర సంస్థ. తల్లీ బిడ్డ సంరక్షణ విభాగంపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. 2016 ఫిబ్రవరి 5న ఈ కంపెనీ ప్రారంభమైంది. 2020-21లో రూ.15.44 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని