ఐఎస్‌బీలో బీవీ జగదీశ్‌ పేరుమీద ప్రొఫెషనల్‌ ఛైర్‌

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌ ప్రాంగణంలో, పారిశ్రామికవేత్త, దాత బీవీ జగదీశ్, అనూరాధ జగదీశ్‌ దంపతుల పేరుమీద ప్రొఫెసర్‌షిప్‌ ఛైర్‌ను ఏర్పాటు చేసింది.

Published : 20 May 2022 02:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌ ప్రాంగణంలో, పారిశ్రామికవేత్త, దాత బీవీ జగదీశ్, అనూరాధ జగదీశ్‌ దంపతుల పేరుమీద ప్రొఫెసర్‌షిప్‌ ఛైర్‌ను ఏర్పాటు చేసింది. ఐఎస్‌బీ ప్రారంభ సమయంలోనూ ఆ తరవాత అనేక సందర్భాల్లో జగదీశ్‌ అందించిన సహాయానికి గుర్తింపుగా దీన్ని ఏర్పాటు చేసినట్లు డీన్‌ ప్రొఫెసర్‌ మదన్‌ పిల్లుట్ల తెలిపారు. ఎంతోమంది సహాయంతోనే ఐఎస్‌బీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఐఎస్‌బీ లాంటి విద్యా సంస్థల అవసరం ఎంతో ఉందని, ఇందులో బాగస్వామ్యం కావడం ఆనందాన్ని కలిగిస్తోందని బీవీ జగదీశ్, అనూరాధ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని