ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్‌.. అకౌంట్లోకి PF వడ్డీ

PF Interest: ఈపీఎఫ్‌ వడ్డీ మొత్తాలు సబ్‌స్క్రైబర్ల ఖాతాల్లో జమ అవుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 8.15 శాతం చొప్పున ఈ మొత్తం జమ అవుతోంది.

Published : 10 Nov 2023 14:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్‌ నిల్వలపై వడ్డీ (PF Interest) మొత్తాలను పీఎఫ్‌ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ మొత్తాలు జమ అవ్వగా.. ఇంకా పలువురి ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అకౌంట్లలో కనిపించడానికి కాస్త సమయం పడుతుందని ఈపీఎఫ్‌ఓ ఓ ఎక్స్‌ యూజర్‌కు ఇచ్చిన సమాధానంలో పేర్కొంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ నిల్వలలపై 8.15 శాతం వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఈపీఎఫ్‌ఓ వడ్డీని ఆయా ఖాతాల్లో జమ చేస్తోంది. ఈపీఎఫ్ వడ్డీ మొత్తం జమ అయ్యిందో లేదో ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో సర్వీసెస్‌ విభాగంలోకి వెళ్లి ‘ఫర్‌ ఎంప్లాయీస్‌’ సెక్షన్‌ ఎంచుకోవాలి. అందులో మెంబర్‌ పాస్‌బుక్‌ను ఎంచుకోవాలి. తర్వాత లాగిన్‌ పేజీలో యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వడం ద్వారా ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

ఆధార్‌తో లింక్‌.. 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీయాక్టివ్‌

కేంద్రం తీసుకొచ్చిన ఉమాంగ్‌ యాప్‌ ద్వారా కూడా పీఎఫ్‌ వడ్డీ మొత్తం జమ అయ్యిందో లేదో చూసుకోవచ్చు. ఉమాంగ్‌ యాప్‌లో ఈపీఎఫ్‌ సెక్షన్‌లోకి వెళ్లి.. వ్యూ పాస్‌బుక్ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి గెట్‌ ఓటీపీ ఆప్షన్‌ ఎంచుకోవాలి. తర్వాత మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు ఈపీఎఫ్‌ అకౌంట్‌ వివరాలు కనిపిస్తాయి. కావాలంటే ఇ-పాస్‌బుక్‌ను పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని