Hero MotoCorp: వాహన కొనుగోలుదారులకు షాక్‌.. రేట్లు పెంచిన హీరో మోటోకార్ప్‌!

Hero MotoCorp: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Published : 23 Jun 2022 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లపై రూ.3వేల వరకు (price raise) పెంచుతున్నట్లు ప్రకటించింది. జులై 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది.

పెంపు ఎంతనేది మాత్రం ఇతిమిత్థంగా హీరో మోటో కార్ప్‌ వెల్లడించలేదు. మోడల్‌ను బట్టి ఈ పెంపు ఉంటుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ద్రవ్యోల్బణం కారణంగా ముడి సరకులు పెరిగాయని, దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరగడంతో పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఇప్పటికే కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ సైతం ఏప్రిల్‌లో ధరలు సవరించింది. ఇతర ద్విచక్ర వాహన కంపెనీలు సైతం హీరో మోటోకార్ప్‌ బాటను అనుసరించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని