Published : 19 Apr 2022 13:39 IST

విదేశీ విద్యకు నిధులు ఎలా స‌మ‌కూర్చుకోవాలి?

ఇప్పుడు త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల చ‌దువుకి  ఎన‌లేని ప్రాధాన్య‌త ఇస్తున్నారు. విదేశీ చ‌దువుల‌కు మొగ్గుచూపే విద్యార్ధులు ఇప్పుడు ఎక్కువ‌య్యారు. విదేశాల్లో చ‌ద‌వ‌డం అనేది చాలా మందికి ఒక క‌ల‌, కానీ కొంత‌మంది మాత్ర‌మే దీనిని సాధిస్తారు. ఈ విదేశీ చ‌దువుల‌కు వివిధ అడ్డంకులు ఏర్ప‌డ‌తాయి, అతి పెద్ద అడ్డంకి ఆర్ధిక ఇబ్బందులే. విదేశీ విద్యకు ఎక్కువ‌గానే ఖ‌ర్చులు అవుతాయి. ఈ ఖ‌ర్చులు స‌మ‌కూర్చ‌డం అంద‌రికీ సాధ్యం కాక‌పోవ‌చ్చు.

విదేశాల‌కు వెళ్లేట‌ప్పుడు వెంట‌నే డ‌బ్బులు స‌మ‌కూర్చుకోవ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. ఈ విదేశీ చ‌దువు ఖ‌ర్చుల కోసం త‌ల్లిదండ్రులు ముందు నుండి త‌యార‌వ్వ‌డం మంచిది. మొద‌ట్లోనే ఈ విదేశీ విద్య కోసం ఫండ్‌ని పోగేయ‌డం గురించి బ‌ల‌మైన ల‌క్ష్యం ఏర్ప‌ర‌చుకోవాలి. విద్యార్ధులు చిన్న‌వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడే చిన్న మొత్తాల‌లో పొదుపు చేయ‌డం ప్రారంభించాలి. పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం ఒక సిస్ట‌మాటిక్ ఇవ్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా విద్యా నిధిని సృష్టించుకోవాలి. త‌ల్లిదండ్రులు త‌మ పొదుపుల నుండి సాధ్య‌మైనంత వ‌ర‌కు పిల్ల‌ల విదేశీ విద్య‌కు ఖ‌ర్చుపెట్టి, మిగ‌తాది బ్యాంకుల వ‌ద్ద విద్యా రుణం తీసుకోవ‌చ్చు.

స్కాల‌ర్‌షిప్‌లు:

చాలా విశ్వ‌విద్యాల‌యాలు అంత‌ర్జాతీయ విద్యార్ధుల కోసం 'స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రామ్‌'ల‌ను క‌లిగి ఉన్నాయి. మీరు ధ‌ర‌ఖాస్తు చేయాల‌నుకుంటున్న క‌ళాశాల‌ల జాబితాను రూపొందించేట‌ప్పుడు వారి స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రామ్‌ల ఆధారంగా మీరు త‌గు నిర్ణ‌యాలు తీసుకోవాలి. స్కాల‌ర్‌షిప్‌, దాని విశ్వ‌స‌నీయ‌త కోసం అర్హ‌త ప్ర‌మాణాల‌ను సరి చూసుకోండి. ట్యూష‌న్ ఫీజు మిన‌హాయింపు వెయ్యి డాల‌ర్ల నుండి ఉంటాయి. అంత‌ర్జాతీయ విద్యా విష‌యాల‌లో స్కాల‌ర్‌షిప్ ల‌భిస్తే విద్యార్ధికి త‌గినంత ఆర్ధిక ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్టే అని చెప్పుకోవాలి.

విద్యా స‌ల‌హాదారులు:

ఇప్పుడు ప్ర‌తి విష‌యానికి స‌ల‌హాదారులు ఉన్న‌ట్టే విద్య‌కు కూడా స‌ల‌హాదారులు ఉంటున్నారు, వారిని సంప్ర‌దించ‌డం చాలా మంచిది. ఈ నిపుణులు విద్యా విష‌యాల‌లో వివిధ దేశాలు, వారందించే ప్రోగ్రామ్‌లు, క‌ళాశాల‌లు అందించే స్కాల‌ర్‌షిప్‌ల గురించి తెలుసుకుంటారు. వారు మీ క‌ళాశాల‌, వీసా ధ‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ నుండి మ‌రిన్ని అంత‌ర్జాతీయ విద్యా విష‌యాల‌లో మీకు స‌హాయం చేయ‌గ‌ల‌రు. ఈ స‌ల‌హాదారులు.. విద్యార్ధుల విద్యా, సాంస్కృతిక‌, ఆర్ధిక నేప‌థాన్ని అంచ‌నా వేయ‌డం ద్వారా స‌రైన కోర్సులు చేయ‌డానికి స‌హాయం చేస్తారు. వీరు ఆర్ధిక ప్ర‌ణాళిక‌లో విద్యార్ధుల‌కు సాధ్య‌మైన చోట ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునే మార్గాల‌ను కూడా సూచిస్తారు.

పార్ట్ టైమ్ ప‌ని:

విదేశీ విద్యార్ధులు వివిధ దేశాల‌లో చ‌దువుకునేట‌ప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయ‌డం సాధార‌ణమైన విష‌య‌మే. మీ కోర్సులో ఖాళీ స‌మ‌యం ఏర్ప‌డిన‌ప్పుడు పార్ట్‌టైమ్ ఉద్యోగం లేదా కోర్సులో భాగంగా శెల‌వులు ఇచ్చిన‌పుడు ఉద్యోగం చేయండి. ఇది మీకు అద‌న‌పు డ‌బ్బు, కొంత అనుభ‌వాన్ని సంపాదించ‌డంలో మీకు స‌హాయ‌ప‌డుతుంది. విదేశాల్లో మీ అధ్య‌య‌నానికి నిధులు స‌మ‌కూర్చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అయితే విదేశాల‌కు వెళ్లిన ప్రారంభ కాలంలో పార్ట్ టైమ్ ఉద్యోగం వెంట‌నే దొర‌క‌డం క‌ష్టం, ఓపిక ప‌ట్టాల్సి ఉంటుంది.

మీరు విద్యా రుణాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే మందు, విదేశీ విద్య‌కు నిధులు స‌మ‌కూర్చ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల విద్యా సంక్షేమ ప‌థ‌కాలు ఉన్నాయేమో గ‌మ‌నించండి. భార‌త ప్ర‌భుత్వం, అనేక అంత‌ర్జాతీయ సంస్థ‌లు, విశ్వ‌విద్యాల‌యాల స‌హ‌కారంతో విదేశాల‌లో చ‌దువుకోవ‌డానికి స్కాల‌ర్‌షిప్‌ల‌ను అందిస్తుంది.

అధికారిక‌, విశ్వ‌స‌నీయ సంస్థ‌ల నుండి మాత్ర‌మే రుణాన్ని స్వీక‌రించండి. వారు సంస్థ‌ల ప్ర‌మాణిక‌త‌, ఆమోదించ‌బ‌డిన ప్రోగ్రామ్‌లు, త‌న‌ఖా అవ‌స‌రాలు, రుణ చెల్లింపుల నిబంధ‌న‌లు మొద‌లైన వాటిని అంచ‌నా వేస్తారు. అంతేకాకుండా మంచి వడ్డీ రేటు కి రుణాన్ని ఆమోదిస్తారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని