ద్విచ‌క్ర వాహ‌న బీమాను బ‌దిలీ చేయ‌డం ఎలా?

ఎన్‌సీబీ స‌ర్టిఫికేట్‌ను బీమా సంస్థ‌కు స‌మ‌ర్పించ‌డం ద్వారా కొత్త ద్విచ‌క్ర వాహ‌న బీమా ప్రీమియంపై రాయితీ పొంద‌వ‌చ్చు

Updated : 21 Jan 2021 12:36 IST

ఒక వ్యక్తి తన ద్విచ‌క్ర వాహనాన్ని మరొకరికి విక్రయించినప్పుడు  బీమా పాలసీ బదిలీ జరుగుతుంది. వాహ‌నాన్ని విక్ర‌యించిన‌ప్పుడు, దానికి సంబంధించిన‌ పాలసీని కూడా కొత్త య‌జ‌మాని పేరుపై బదిలీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే  వాహనాన్ని అమ్మిన త‌రువాత రోడ్డు ప్ర‌మాదం జ‌రిగితే బీమా సంస్థ దావాను తిరస్కరించవచ్చు. 

ద్విచ‌క్ర వాహ‌న బీమాను బ‌దిలీ చేయు విధానం..

1. కొత్త య‌జ‌మాని పేరుపై వాహ‌న రిజిస్ట్రేష‌న్ బ‌దిలీ ప్ర‌క్రియ‌ పూర్తైన 15 రోజుల‌లోపు ద్విచ‌క్ర వాహ‌న బీమా పాల‌సీ బ‌దిలీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

2. బీమా బ‌దిలీ కోసం కావ‌ల‌సిన అన్ని ప‌త్రాల‌ను సేక‌రించాలి. ఉదాహ‌ర‌ణ‌కు, ద్విచ‌క్ర వాహ‌న ఆర్‌సీ(రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్‌), యాజ‌మాన్య బ‌దిలీ ప‌త్రాలు, ఇప్ప‌టికే ఉన్న బీమా పాల‌సీ మొద‌లైన‌వి.

3. కేవైసీ(మీ ఖాతా దారుని తెలుసుకోండి) కోసం, ఆధార్ కార్డు, డ్రావింగ్ లైసెన్స్ మొద‌లైన ప‌త్రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. వాహ‌న విక్రేత‌, కొనుగోలుదారుడు ఇరువురు ఒకే విధంగా స‌మ‌ర్పించాలి. 

ప్రాంతీయ ర‌వాణా కార్యాల‌యం(ఆర్‌టీఓ) ఆఫీస్ వ‌ద్ద య‌జ‌మాన్య బ‌దిలీ చేసుకున్న త‌రువాత‌, బీమా బ‌దిలీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు బ‌దిలీ బదిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫారం 29, ఫారం 30, ఎమిష‌న్ టెస్ట్ పేప‌ర్లు, సేల్ డీడ్, విక్రేత నో అబ్జెక్షన్ క్లాజ్ (ఎన్‌ఓసి), ఇన్స్‌పెక్ష‌న్ రిపోర్ట్‌(బీమా సంస్థ ఇస్తుంది), పాత పాల‌సీ డాక్యుమెంట్ వంటి ఇతర పత్రాలను బీమా సంస్థ‌కు అందించాలి.   వీటితో పాటు కొంత నామ‌మాత్ర‌పు రుస‌మును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ పూర్తైన త‌రువాత బ‌దిలీ చేసిన ప‌త్రాన్ని అంద‌జేస్తుంద‌ని ప్రోబస్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ రాకేశ్ గోయల్ వివ‌రించారు. 

నో క్లెయిమ్ బోన‌స్ మాటేంటి?

సాధార‌ణంగా బీమా సంస్థ‌లు, ఒక సంవ‌త్స‌రం మొత్తం మీద ఏవిధ‌మైన క్లెయిమ్ ఫైల్ చేయ‌ని వారికి సంవ‌త్స‌రం చివ‌ర‌న పున‌రుద్ద‌ర‌ణ ప్ర‌మీయంపై డిస్కౌంటును ఇస్తారు. దీనినే నో క్లెయిమ్ బోన‌స్(ఎన్‌సీబీ) అంటారు.

బైక్ బీమా పాల‌సీని బ‌దిలీచేస్తున్న‌ప్పుడు, ఎన్‌సీబీ స‌ర్టిఫికేట్‌ను బీమా సంస్థ‌కు స‌మ‌ర్పించ‌డం ద్వారా కొత్త ద్విచ‌క్ర వాహ‌న బీమా ప్రీమియంపై రాయితీ పొంద‌వ‌చ్చు. 

"వాహ‌న విక్రేత పాల‌సీని బైక్ కొనుగోలు చేసిన వ్య‌క్తికి బ‌దిలీ చేయ‌వ‌చ్చు. కానీ పాల‌సీకి సంబంధించిన ఎన్‌సీబీని మాత్రం బ‌దిలీ చేయ‌లేరు. అయితే పాత వాహ‌నం ఎన్‌సీబీని, అత‌ను/ ఆమె కొనుగోలు చేసే కొత్త వాహ‌నానికి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఒక్క‌డ ఒక విష‌యం గుర్తించుకోవాలి. ద్విచ‌క్ర వాహ‌నానికి సంబంధించిన పాల‌సీ ఎన్‌సీబీని మ‌రో కొత్త ద్విచ‌క్ర వాహ‌న పాల‌సీకి మాత్ర‌మే బ‌దిలీ చేస్తారు. నాలుగు చ‌క్రాల వాహ‌నానికి బ‌దిలీ చేయ‌రు." అని గోయ‌ల్ తెలిపారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని