No-Cost EMI: నో-కాస్ట్ ఈఎంఐ.. ఇవన్నీ తెలుసుకున్నాకే!
No-Cost EMI: ఖరీదైన వస్తువులు కొనాలనుకున్నప్పుడు నో-కాస్ట్ ఈఎంఐ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఒకేసారి మొత్తం ధర చెల్లించే స్థితిలో లేకపోయినా.. ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు.
No-Cost EMI | ఇంటర్నెట్ డెస్క్: అధిక ధర కలిగిన వస్తువులను కొనడానికి నో-కాస్ట్ ఈఎంఐ ఒక పాపులర్ సదుపాయం. మొత్తం ధర ఒకేసారి చెల్లించకుండానే రిఫ్రిజిరేటర్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, మొబైల్ ఫోన్లు సహా ఇతర వస్తువులను సొంతం చేసుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI)తో ప్రయోజనం ఉన్నప్పటికీ.. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి.
నో-కాస్ట్ ఈఎంఐ ఎలా పనిచేస్తుంది?
కస్టమర్లకు నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI) పలు రకాలుగా అందుబాటులో ఉంటుంది. రెగ్యులర్ ఈఎంఐతో ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు దానిపై ఉండే రాయితీ ప్రయోజనాన్ని మనకు బదిలీ చేస్తారు. అదే నో-కాస్ట్ ఈఎంఐ అయితే రాయితీని తీసేస్తారు. అప్పుడు మొత్తం ధర చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వస్తువు 10 శాతం రాయితీ తర్వాత రూ.4,500 లభిస్తుంది అనుకుందాం. అదే వస్తువును నో-కాస్ట్ ఈఎంఐ కింద తీసుకుంటే.. రాయితీ లేకుండా దాని వాస్తవ ధర అయిన రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. మరో విధానంలో.. ఒక వస్తువు ధర రూ.5,000 అనుకుందాం. దాన్ని నో-కాస్ట్ ఈఎంఐతో కొంటే.. వడ్డీని సైతం వస్తువు ధరలో కలిపేస్తారు. వడ్డీ రూ.1,000 అనుకుంటే.. మొత్తం రూ.6,000 వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మరో ఆప్షన్‌లో వడ్డీని ప్రాసెసింగ్ ఫీజుల కింద వసూలు చేస్తారు.
ఎప్పుడు తీసుకుంటే మేలు..
ఖరీదైన వస్తువులు కొనాలనుకున్నప్పుడు నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI) ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఒకేసారి మొత్తం ధర చెల్లించే స్థితి లేకపోయినా.. ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఒక్కోసారి విక్రేతలు క్రెడిట్ కార్డ్ ద్వారా నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకుంటే రాయితీని ఆఫర్ చేస్తుంటారు.
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ఉంటుందా?
సకాలంలో నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI) చెల్లించకపోతే.. క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అందుకే ఈఎంఐ ఆప్షన్ ఎంపిక చేసుకునేటప్పుడే.. చెల్లించే సామర్థ్యం ఉందా.. లేదో.. ఒకటికి రెండుసార్లు అంచనా వేసుకోవాలి. తద్వారా ఎగవేత ప్రమాదం ఉండదు.
నో-కాస్ట్ Vs రెగ్యులర్ ఈఎంఐ..
నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI)లో వడ్డీని వస్తువు ధరలో కలిపేయడం లేదా ప్రాసెసింగ్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు. అదే రెగ్యులర్ ఈఎంఐ లోన్‌లో అయితే ప్రతినెలా వాయిదాలో వడ్డీని ప్రత్యేకంగా చూపిస్తారు.
అదనపు ఛార్జీలు..
నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI) తీసుకునేటప్పుడే ఎలాంటి ఛార్జీలు ఉంటాయో ముందే అడిగి తెలుసుకోవాలి. ముందస్తు చెల్లింపు ఛార్జీలు, ఆలస్య రుసుము.. వంటి ఛార్జీలు ఎలా ఉంటాయో కనుక్కోవాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/2023)
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
Sports News
ఆ బౌలర్ అరంగేట్రం.. అతడికి జాక్‌పాట్
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు