DPI model: భారత్‌ను చూసి నేర్చుకోవచ్చు : గేట్స్‌ ఫౌండేషన్‌ చీఫ్‌

ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారత్‌ విజయవంతంగా అమలు చేస్తున్న డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మోడల్‌ను (DPI Model) ప్రపంచం ఉపయోగించుకోవచ్చని గేట్స్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

Updated : 16 Jan 2024 14:12 IST

దావోస్‌: వివిధ రంగాల్లో భారత్‌ సాధిస్తోన్న పురోగతి, అమలు చేస్తున్న డిజిటల్‌ విధానాలపై బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ (Gates Foundation) ప్రశంసలు గుప్పించింది. ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారత్‌ విజయవంతంగా అమలుచేస్తున్న డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మోడల్‌ను (DPI Model) యావత్‌ ప్రపంచం వినియోగించుకోవచ్చని తెలిపింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (WEF) వార్షిక సదస్సులో భాగంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు క్రిస్టోఫర్‌ జే ఇలియాస్  మాట్లాడారు.

‘భారత్‌లో ఆరోగ్యం, వ్యవసాయం, నీరు, పారిశుద్ధ్యం, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సమ్మిళిత ఆర్థిక సేవలు సహా అనేక రంగాల్లో బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ పనిచేస్తోంది. కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నాం. 20 ఏళ్ల క్రితమే కార్యాలయాన్ని నెలకొల్పాం. మా సేవలను మున్ముందు కొనసాగిస్తాం. ముఖ్యంగా ఆర్థిక సేవలు, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్‌ ఎంతో పురోగతి సాధించడానికి డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  విధానం ఎంతగానో దోహదపడింది. ప్రపంచం అనుకరించడానికి ఇదో మంచి విధానం అని భావిస్తున్నా’ అని క్రిస్టోఫర్‌ పేర్కొన్నారు.

TCS కీలక నిర్ణయం.. 5 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు జెన్‌ ఏఐలో శిక్షణ

గత దశాబ్దకాలంగా వేగంగా పురోగతి సాధించడంతో పాటు దేశాభివృద్ధిలో యూనివర్సల్‌ ఐడీ, యూనివర్సల్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ వంటివి ఎంతగానో దోహదం చేశాయని గేట్స్‌ ఫౌండేషన్‌ చీఫ్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ అభివృద్ధి లక్ష్యాలను వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ దోహదపడుతుందన్నారు. కానీ, దాన్ని బాధ్యతాయుతంగా, నైతిక విలువలు, నియంత్రణలతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని