Electric Vehicles : ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌పై ఆఫర్స్‌.. కొనుగోలుకు ఇదే ఛాన్స్‌!

Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనం కొనాలనుకుంటున్నారా? అయితే, విద్యుత్‌ వాహన తయారీ సంస్థలు అందిస్తున్న ఆఫర్లు, ప్రయోజనాల గురించి తెలుసుకోండి.

Updated : 22 Dec 2023 16:50 IST

Electric Vehicles | ఇంటర్నెట్ డెస్క్‌: విద్యుత్‌ ద్విచక్ర వాహనం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇయర్‌ ఎండ్‌ సందర్భంగా అనేక ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థలు పెద్దఎత్తున ఆఫర్లు అందిస్తున్నాయి. మరోవైపు ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రెండో దశ (FAME-2) కింద కేంద్రం అందిస్తున్న సబ్సిడీ గడువు త్వరలో ముగియనుంది. దీన్ని మరోసారి పొడిగిస్తారా? అనేది అనుమానమే. దీంతో ఈ నెలలోనే వాహన కొనుగోలుకు ముందడుగు వేయడం మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ విద్యుత్‌ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలని చూస్తుంటే ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి..

విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్‌ (Ather) ఎంపిక చేసిన వాహన కొనుగోళ్లపై రూ.24,000 వరకు తగ్గింపు అందిస్తోంది. ఏథర్‌ 450 ఎస్‌ (Ather 450S), ఏథర్‌ 450ఎక్స్‌ (450X)మోడల్‌ ద్విచక్ర వాహనాలపై రూ.6,500 నగదు ప్రయోజనాలు అందిస్తోంది. అదనంగా రూ.1,500 కార్పొరేట్‌ ఆఫర్‌ ప్రయోజనాలు పొందొచ్చని కంపెనీ ప్రకటించింది. ‘ఏథర్‌ ఎలక్ట్రిక్‌ డిసెంబర్‌’ ప్రోగ్రామ్‌ కింద కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.5,000 డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు పేర్కొంది. డిసెంబరు 31 వరకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

రూల్డ్ పేపర్‌లో చేతిరాతతో రాజీనామా లేఖ.. ఎండీకి పంపిన లిస్టెడ్‌ కంపెనీ సీఎఫ్‌ఓ

ఓలా ఎలక్ట్రిక్‌ (Ola electric) ఇయర్‌ ఎండ్‌ ఆఫర్లను ఇప్పటికే ప్రకటించింది. ఓలా ఎస్‌1 ఎక్స్‌+ (Ola S1 X+)పై రూ.20 వేల డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.5 వేల డిస్కౌంట్‌తో పాటు, జీరో ప్రాసెసింగ్‌ ఫీజు, 6.99 శాతం వడ్డీ రేటుకే రుణం వంటి సదుపాయాలు అందిస్తున్నట్లు పేర్కొంది. హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) కూడా తన విడా విద్యుత్‌ స్కూటర్లపై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ అందిస్తోంది. రూ.7,500 వరకు ఈఎంఐ ప్రయోజనాలు, రూ.8,259 విలువ చేసే బ్యాటరీ వారెంటీ పొడిగింపు, రూ.6,500 డిస్కౌంట్‌, రూ.5,000 ఎక్స్ఛేంజీ బోనస్‌, రూ.7,500 లాయల్టీ డిస్కౌంట్‌, రూ.2,500 కార్పొరేట్‌ డిస్కౌంట్‌, రూ.1,125 విలువచేసే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లతో మొత్తం కలిపి రూ.38,500 వరకు ప్రయోజనాల్ని అందిస్తోంది.

దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన FAME-2 గడువు త్వరలో ముగియనుంది. ఫేమ్‌-1కు కొనసాగింపుగా ఫేమ్‌-2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్‌ 1న కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా టూవీలర్‌, త్రీవీలర్‌, ఫోర్‌ వీలర్‌ కొనుగోళ్లపై సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ పథకం 2024 మార్చి 31తో ముగియనుంది. స్కీమ్‌ను పొడిగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదిస్తుండగా.. ఆర్థిక మంత్రిత్వ, ఇతర మంత్రిత్వ శాఖలు మాత్రం విముఖత చూపుతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ పథకం పొడిగించకపోతే ఇక సబ్సిడీ నిలిచిపోయినట్లే. వినియోగదారులు పూర్తి సొమ్ము చెల్లించి ఈవీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని