ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగనున్నాయా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19తో స‌హా ప‌లు అంశాల కార‌ణంగా, సెటిల్ చేసిన జీవిత బీమా క్లెయిమ్‌ల వాస్త‌వ మొత్తం ఊహించిన దానికంటే ఎక్కువ‌గా ఉంది. మీరు ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాల‌ని చూస్తున్న‌ట్ల‌యితే, ప్రీమియం ఖ‌ర్చును ఆదా చేసుకోవాల‌నుకుంటే, ఇప్ప‌టికీ ట‌ర్మ్ ఇన్సూరెన్స్‌ని తీసుకోని కొత్త‌వారైతే బీమాను తీసుకోవ‌డానికి తొంద‌ర‌ప‌డాల్సి ఉంటుంది. ప్ర‌పంచ రీ-ఇన్స్యూర‌ర్లు త‌మ రేట్ల‌ను పెంచిన‌ట్ల‌యితే ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల ప్రీమియంలు త్వ‌ర‌లో పెర‌గ‌వచ్చు. కొంత‌మంది రీ-ఇన్సూరెన్స్ రేట్ల‌ను పెంచాల‌ని భావిస్తున్నారు.

కొవిడ్‌-19 మ‌ర‌ణాల ప్ర‌భావంతో క్లెయిమ్స్ పెరిగిన కార‌ణంగా ట‌ర్మ్ ప్లాన్ రేట్ల‌ను స‌వ‌రించ‌డానికి ఒక కార‌ణం కావొచ్చు. అంతేకాకుండా భ‌విష్య‌త్ స్థూల ఆర్థక కార‌ణాలు, ఊహించే మ‌ర‌ణాల రేటు, ఇత‌ర బీమా ప్ర‌మాణాల‌తో పాటు కొంత‌మంది రీ ఇన్సూర‌ర్లు రేట్ల‌ను సవరించవచ్చు. అయితే రీ-ఇన్సూర‌ర్లు త‌మ రేట్లు పెంచిన త‌ర్వాత‌, భార‌త్‌లో ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్ల‌పై త‌క్ష‌ణ ప్ర‌భావం ఉండ‌క‌పోవ‌చ్చు. ప్రీమియం రేట్ల‌ను పెంచాల‌నే నిర్ణ‌యం కంపెనీ వ్యూహంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ప్రీమియంలు పెంచవ‌చ్చు లేదా వారి మార్జిన్‌లు త‌గ్గించుకోవ‌డం ద్వారా బీమా ప్రీమియం రేట్ల‌ను అలాగే ఉండనివ్వొచ్చు.

ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేటు సవ‌రిస్తే అది అన్ని వ‌ర్గాల్లో ఒకేలా ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే స‌వ‌రించిన ప్రీమియం రేట్లు వ‌య‌స్సు, గ్రూపులు, జెండ‌ర్‌, ఎంచుకున్న హామీ మొత్తం మొద‌లైన‌వాటిలో విభిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా పెంపుద‌ల ఉన్న‌ప్ప‌టికీ, ప్ర‌స్తుత పాల‌సీదారుల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు. ఒక‌రు బీమా పాల‌సీని కొనుగోలు చేసిన రోజు నుంచి జీవిత బీమా ప్రీమియంలు లాక్ చేస్తారు. అందువ‌ల్ల ప్రస్తుత పాలసీదారులు లేదా రాబోయే కొది రోజుల్లో బీమాను కొనుగోలు చేయాల‌నుకుంటున్న వినియోగ‌దారులు, ప్రీమియంల పెరుగుద‌ల గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.

చివ‌ర‌గా: ఆర్థిక ఆధారిత కుటుంబం ఉన్న ఎవ‌రికైనా ట‌ర్మ్ ప్లాన్ క‌వ‌రేజ్ త‌ప్ప‌నిస‌రి. బీమా తీసుకున్న త‌ర్వాత ప్ర‌తి 5 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి దానిని స‌మీక్షిస్తూ ఉండాలి. మీరు త‌గినంత ట‌ర్మ్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్‌ని క‌లిగి ఉన్న త‌ర్వాత మాత్ర‌మే ఆర్థిక ప్ర‌ణాళిక కోసం, మీ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం పొదుపు చేయ‌డం ప్రారంభించండి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని