LPG: ‘బండ’ బాదుడు.. మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధరలు

వంట గ్యాస్‌ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది. గ్యాస్‌ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

Updated : 01 Mar 2023 10:48 IST

హైదరాబాద్: వంట గ్యాస్‌ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది. గ్యాస్‌ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50 బాదేశారు. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

మంగళవారం వరకు గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.1,105 ఉండగా తాజా పెంపుతో అది రూ.1,155 అయింది. వాణిజ్య సిలిండర్‌ ధర దిల్లీలో రూ.2119.50కు ఎగబాకింది. గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,103కి చేరింది. వాణిజ్య సిలిండర్‌ ధరలను పెంచడం ఈ ఏడాది రెండోసారి. జనవరి మొదటిరోజున రూ.25 మేర పెంచారు. ఇప్పటికే నిత్యావసర సరకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్‌ ధరలతో ఆ భారం మరింత పెరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని