OnePlus Pad Go: ₹20 వేలకే 2.4K డిస్‌ప్లేతో వన్‌ప్లస్‌ ట్యాబ్‌.. విశేషాలివీ..

OnePlus Pad Go details: వన్‌ప్లస్‌ సంస్థ ప్యాడ్‌ గో పేరిట కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్‌ 20 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Published : 06 Oct 2023 15:30 IST

OnePlus Pad Go launched | ఇంటర్నెట్ డెస్క్‌: మొబైల్‌ ఫోన్లతో తనకంటూ మార్కెట్‌ను సొంతం చేసుకున్న వన్‌ప్లస్‌ (OnePlus) సంస్థ.. తాజాగా కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. గతంలో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ను లాంచ్‌ చేసిన ఆ సంస్థ.. ఇప్పుడు వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో (OnePlus Pad Go) పేరిట మరో కొత్త ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చింది. రూ.20వేల్లోపు ధరలో 2.4K స్క్రీన్‌తో ఈ ట్యాబ్‌ను తీసుకురావడం గమనార్హం. ఇంతకీ ఈ ట్యాబ్‌ ఫీచర్లు, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..

వన్‌ప్లస్‌ ప్యాడ్‌ (OnePlus Pad Go) మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.19,999కు లభిస్తుంది. ఇది వైఫైతో పనిచేస్తుంది. అలాగే 8జీబీ+128జీబీ ఎల్‌టీఈ (LTE) వేరియంట్‌ ధర రూ.21,999గానూ, 8జీబీ+256 జీబీ ఎల్‌టీఈ (LTE) వేరియంట్‌ ధర రూ.23,999 గానూ కంపెనీ నిర్ణయించింది. అక్టోబర్‌ 20 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, వన్‌ప్లస్‌ వెబ్‌సైట్లతో పాటు రిలయన్స్‌, క్రోమా వంటి ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ లభిస్తుంది. అక్టోబర్‌ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ప్రీ ఆర్డర్‌పై రూ.2వేలు బ్యాంక్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే, రూ.1399 విలువైన ప్యాడ్‌ గో ఫోలియో కవర్‌ ఉచితంగా అందిస్తారు.

ఎంఐ పండగ సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై 45 శాతం వరకు డిస్కౌంట్‌

ఇక వన్‌ప్లస్‌ కొత్త ప్యాడ్‌ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇందులో 2.4k రిజల్యూషన్‌ కలిగిన 11.35 అంగుళాల డిస్‌ప్లే అమర్చారు. 7:5 రేషియోతో 90Hz రిఫ్రెష్‌ రేటు కలిగిన డిస్‌ప్లేతో వస్తోంది. 400 నిట్స్‌ అడాప్టివ్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఎలక్ట్రానిక్‌ డివైజు నుంచి వచ్చే హానికర బ్లూలైట్‌ను ఇందులోని లో బ్లూలైట్‌ టెక్నాలజీ అడ్డుకుంటుంది. ఇందులో 8000 ఎంఏహెచ్‌ బ్యాటరీ అమర్చారు. ఇది 33w సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 514 గంటల స్టాండ్‌బై టైమ్‌, 40 గంటల మ్యూజిక్‌ ప్లే బ్యాక్‌తో ప్యాడ్‌ వస్తుంది. ఇందులోని రెండు వేరియంట్లు 4జీ సిమ్‌కార్డుతో వినియోగించుకోవచ్చు. బేసిక్‌ వేరియంట్‌లో మాత్రమే వైఫైపై ఆధారపడాల్సి ఉంటుంది. మొబైల్‌ డేటాను వినియోగించుకోవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని