వాహనాల ఎగుమతుల్లో తగ్గుదల

కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 39 శాతం మేర పడిపోయాయి. తొలి ఆరు నెలల్లో లాక్‌డౌన్‌ల కారణంగా అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడడం........

Published : 18 Apr 2021 20:10 IST

దిల్లీ: కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 39 శాతం మేర పడిపోయాయి. తొలి ఆరు నెలల్లో లాక్‌డౌన్‌ల కారణంగా అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడడం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ద్వితీయార్ధంలో పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. 2019-2020 నాటి గణాంకాలను మాత్రం చేరుకోలేకపోయాయి.

సియామ్‌ గణాంకాల ప్రకారం.. 2019-20లో 6,62,118 యూనిట్లుగా ఉన్న ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 2020-21 నాటికి 4,04,400 యూనిట్లకు పడిపోయాయి. వీటిలో కార్ల ఎగుమతులు 44.32 శాతం పడిపోగా.. యుటిలిటీ వాహనాలు 24.88 శాతం, వ్యాన్ల ఎగుమతులు 42.16 శాతం కుంగాయి.

ఇక కంపెనీలవారీగా చూస్తే.. హ్యుందాయ్‌ మోటార్‌ ఎగుమతులు 38.57 శాతం, మారుతీ సుజుకీ ఇండియా 5.34 శాతం, ఫోర్డ్‌ ఇండియా 64.96 శాతం, నిస్సాన్‌ మోటార్‌ ఇండియా 59.25 శాతం, ఫోక్స్‌వ్యాగన్‌ 44.1 శాతం, జనరల్‌ మోటార్స్‌ ఎగుమతులు 47.84 శాతం పడిపోయాయి. వీటికి భిన్నంగా హోండా మోటార్స్‌, కియా మోటార్స్‌ ఇండియా ఎగుమతుల్లో మాత్రం వృద్ధి నమోదుకావడం గమనార్హం. కియా మోటార్స్‌ ఎగుమతులు 88.43 శాతం పెరిగి 40,440 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక హోండా ఎగుమతులు 37.54 శాతం వృద్ధి చెంది 5,151 యూనిట్లుగా రికార్డయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని