Realme: రియల్‌మీ నుంచి 2 స్మార్ట్‌ఫోన్లు.. వెలకమ్‌ ఆఫర్‌ కింద ₹1500 డిస్కౌంట్‌

Realme 11 5G, Realme 11X 5G full details: రియల్‌మీ రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ఈ రెండు ఫోన్లూ ఆగస్టు నెలాఖరులో ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్‌లో అమ్మకాలకు రానున్నాయి.

Published : 23 Aug 2023 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme) కొత్తగా రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో లాంచ్‌ చేసింది. రియల్‌మీ 11 5జీ (Realme 11 5G), రియల్‌మీ 11X 5జీ (Realme 11X 5G) పేరిట ఈ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లూ మీడియాటెక్‌ డైమన్‌సిటీ 6,100+ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. కాకపోతే ఇతర స్పెసిఫికేషన్లలో కంపెనీ మార్పులు చేసింది. ఇదే ఈవెంట్‌లో ఈ రెండు ఫోన్లతో పాటు రియల్‌మీ బడ్స్‌ ఎయిర్‌ 5, రియల్‌మీ బడ్స్‌ ఎయిర్‌ 5 ప్రో పేరిట రెండు ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది.

రియల్‌మీ 11 5జీ రెండు వేరియంట్లలో వస్తోంది. 8జీబీ ర్యామ్‌+128జీబీ వేరియంట్‌ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా పేర్కొంది. గ్లోరీ గోల్డ్‌, గ్లోరీ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 29 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇక రియల్‌మీ 11 ఎక్స్‌ 5జీ ఫోన్‌ 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.14,999గానూ, 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.15,999గానూ కంపెనీ నిర్ణయించింది. మిడ్‌నైట్‌ బ్లాక్‌, పర్పుల్‌ డాన్‌ రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 30 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు ఫోన్లూ ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ.కామ్‌ వెబ్‌సైట్‌, ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తాయని కంపెనీ పేర్కొంది. ప్రారంభ ఆఫర్‌ కింద ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులతో కొనుగోళ్లపై రూ.1,500 డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

గంట పనికి.. రూ.కోట్ల జీతమా..?

  • రియల్‌మీ 5జీ స్పెసిఫికేషన్స్‌: రియల్‌మీ 11 5జీ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0తో పనిచేస్తుంది. ఇందులో 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ శాంసంగ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. డైనమిక్‌ ర్యామ్‌ ఎక్స్‌పాన్షన్‌ సదుపాయం కూడా ఉంది. దీంతో 16జీబీ వరకు ర్యామ్‌ పెంచుకోవచ్చు. వెనుకవైపు 108 మెగాపిక్సల్‌ సెన్సర్‌ అమర్చారు. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 67W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 17 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీని ఛార్జీ చేయొచ్చని కంపెనీ పేర్కొంది.

  • రియల్‌మీ 11X స్పెసిఫికేషన్స్‌: రియల్‌మీ 11ఎక్స్‌ సైతం ఆండ్రాయిడ్‌ 13తో కూడిన రియల్‌మీ యూఐ 4.0తో వస్తోంది. 6.72 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులోనూ డైనమిక్‌ ర్యామ్‌ సదుపాయం ఉంది. వెనుకవైపు 64 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ  ఇస్తున్నారు. 33W సూపర్‌వూక్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

  • రియల్‌మీ బడ్స్‌: బడ్స్‌ ఎయిర్‌ 5, బడ్స్‌ ఎయిర్‌ 5 ప్రో పేరిట రియల్‌మీ తీసుకొచ్చిన రెండు ఇయర్‌బడ్స్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ సదుపాయంతో వస్తున్నాయి. రియల్‌మీ బడ్స్‌ ఎయిర్‌ ధర రూ.3,699 కాగా ఫస్ట్‌ సేల్‌లో రూ.3,499కే లభించనుంది. 5  ప్రో ధర రూ.4,999 కాగా..  రూ.500 తగ్గించి విక్రయిస్తున్నారు. బడ్స్‌ ఎయిర్‌ 5 విక్రయాలు ఆగస్టు 26 నుంచి; 5 ప్రో విక్రయాలు ఆగస్టు 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్లలో లభించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని