Royal Enfield: తుపాను బాధిత కస్టమర్లకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సాయం

Royal Enfield: ప్రముఖ మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని తమ కస్టమర్లకు సాయం ప్రకటించింది.

Updated : 08 Dec 2023 21:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన కస్టమర్లకు సాయం చేయటానికి ద్విచక్ర వాహన సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌  (Royal Enfield) ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తుపాను కారణంగా సమస్యల్లో చిక్కుకున్న వినియోగదారులకు ఉచితంగా టోయింగ్‌, సమగ్ర వాహన తనిఖీ సర్వీసును అందించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

‘మ్యాజిక్‌ రింగ్‌’తో ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 హెచ్‌డీ ఫోన్‌.. ధర, ఫీచర్లివే!

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని కస్టమర్లు ఇందుకోసం 1800-2100-007 టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయించింది. డిసెంబరు 8 నుంచి 20లోగా కాల్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. అలానే వరదలో చిక్కుకున్న మోటార్‌సైకిల్‌ ఇంజన్లను ఉపయోగించకుండా ఉంటేనే మంచిదని కస్టమర్లకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సూచించింది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హ్యుందాయ్‌ మోటార్‌, ఆడి, ఫోక్స్‌వ్యాగన్‌ తదితర వాహన సంస్థలూ ఇప్పటికే తమ వంతు సాయాన్ని ప్రకటించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని