Gold Bonds: ప‌సిడి బాండ్ల‌లో పెట్టుబడులు ఎందుకంటే.. 

 2021-22  సంవ‌త్స‌రంలో జారీచేసిన‌ నాలుగో ద‌శ ప‌సిడి బాండ్ల గ్రాము ధ‌ర‌ రూ.4,807

Updated : 14 Jul 2021 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌భుత్వ ప‌సిడి బాండ్లకు జులై 16 వ‌ర‌కు స‌బ్‌స్ర్రైబ్ చేసుకునే అవ‌కాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నోటిఫికేషన్ ప్రకారం.. ఈ 2021-22 సిరీస్-IV లో గ్రాము ధ‌ర‌ 4,807 గా నిర్ణ‌యించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే పెట్టుబడిదారులకు గ్రాముకు రూ.50 తగ్గుతుంది. అంటే గ్రాము ధ‌ర రూ.4,757కే ల‌భిస్తుంది.

ఈ  సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లలో ఎందుకు పెట్టుబ‌డి పెట్టాలో ఎస్‌బీఐ ఆరు కార‌ణాల‌ను చెప్పింది..

 రాబ‌డి హామీ :  ప‌సిడి బాండ్ల‌పై వ‌డ్డీ 2.50 శాతం, ఆరు నెల‌ల‌కోసారి చెల్లిస్తుంది.

మూలధన లాభంపై ప‌న్ను మినహాయింపు : ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో మూలధన లాభంపై పన్ను లేదు.

రుణ సౌకర్యం : రుణాలకు హామీగా ఉపయోగించవచ్చు;

భ‌ద్ర‌త‌ : ఈ బంగారం డిజిట‌ల్ రూపంలో ఉంటుంది కాబ‌ట్టి సురక్షితం. అదేవిధంగా బంగారాన్ని దాచేందుకు ఎటువంటి ఇబ్బందులు, ఛార్జీలు ఉండ‌వు.

ద్రవ్యత : ఎక్స్ఛేంజీలలో ట్రేడ‌వుతాయి

 జీఎస్‌టీ, అద‌న‌పు ఛార్జీలు లేవు : ఈ ప‌సిడి బాండ్ల‌పై జీఎస్‌టీ లేదు. అదేవిధంగా ఎలాంటి త‌యారీ ఛార్జీలు, లాక‌ర్ ఛార్జీల వంటివి ఉండ‌వు.

కాబట్టి, సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌  పథకంలో రాబడిపై మాత్రమే దృష్టి పెట్టాలని ఎస్‌బీఐ తెలియ‌జేస్తోంది. అయితే ఇత‌ర పెట్టుబ‌డులు, పొదుపు ప‌థ‌కాల‌లో కూడా పెట్టుబ‌డులు ఉండేలా చూసుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని