Stock Market: స్వల్పలాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Stock Market Opening Bell: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండటం దేశీయ సూచీలపై ప్రభావం చూపిస్తోంది.

Published : 05 Jul 2023 09:37 IST

ముంబయి: దేశీయ మార్కెట్‌ సూచీలు (Stock Market) స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ప్రారంభంలో సూచీలు ఊగిసలాట ధోరణి కనబర్చినా.. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలున్నప్పటికీ.. నేడు కూడా కొత్త రికార్డుల్లో ట్రేడవుతోంది. ఉదయం 9.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 78 పాయింట్ల స్వల్ప లాభంతో 65,557 వద్ద, నిఫ్టీ (Nifty) 25 పాయింట్ల లాభంతో 19,413 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు క్షీణించి 82.08గా ట్రేడ్‌ అవుతోంది.

నిఫ్టీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, దివిస్‌ ల్యాబ్స్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫినాన్షియల్‌ సర్వీసెస్‌, ఎన్‌టీపీసీ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆసియా మార్కెట్లు నేడు నష్టాల్లో సాగుతున్నాయి. జపాన్‌ నిక్కీ 0.16శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.15శాతం మేరకు కుంగాయి. చైనా, హాంకాంగ్‌, దక్షిణ కొరియా సూచీలు కూడా స్వల్పంగా పతనమయ్యాయి. అమెరికాలో నిన్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడి మార్కెట్లు పనిచేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని