UPI: భారత్‌లో అతిపెద్ద చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌గా యూపీఐ..!

భారత్‌లో అతిపెద్ద రిటైల్‌ చెల్లింపుల  ప్లాట్‌ఫామ్‌గా యునైటెడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేజ్‌ (యూపీఐ) నిలిచింది. ఈ విషయాన్ని నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎకనామిక్‌ సర్వేలో పేర్కొన్నారు.

Updated : 31 Jan 2022 17:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో అతిపెద్ద రిటైల్‌ చెల్లింపుల  ప్లాట్‌ఫామ్‌గా యునైటెడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేజ్‌ (యూపీఐ) నిలిచింది. ఈ విషయాన్ని నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎకనామిక్‌ సర్వేలో పేర్కొన్నారు. 2021-22లో మొత్తం యూపీఐ ద్వారా 4.6 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.8.26లక్షల కోట్ల నగదు కావడం విశేషం.

యూపీఐని ప్రారంభించిన సమయంలో చిన్నమొత్తాల లావాదేవీల్లో నగదు స్థానాన్ని భర్తీ చేయాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దానిని చేరుకొన్నట్లే కనిపిస్తోంది. మొత్తం లావాదేవీల్లో రూ.200 కంటే తక్కువ విలువైనవి సగానికి పైగా ఉన్నాయి. ఈ విషయాన్ని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

ఇప్పటికే పలు దేశాలు యూపీఐతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపాయి. ఆర్‌బీఐ, మానిటరీ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌లు యూపీఐ, పేనౌ అనుసంధానించే ప్రాజెక్టుపై సంతకాలు చేశాయి. ఇది జులై 2022 నుంచి ప్రారంభం కానుంది. భూటాన్‌ కూడా యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అనుసరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని