Vivo: వివో నుంచి రెండు ప్రీమియం ఫోన్స్.. ధర కాస్త ఎక్కువే!
Vivo Smartphones: చైనా మొబైల్ తయారీ కంపెనీ వివో (Vivo) రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను బుధవారం భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్లు 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తాయని వివో తెలిపింది.
ఇంటర్నెట్‌డెస్క్: చైనా మొబైల్ తయారీ కంపెనీ వివో (Vivo) రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వివో ఎక్స్90 (Vivo X90), వివో ఎక్స్90 ప్రో (Vivo X90 Pro) పేరుతో ఈ ఫోన్లను విడుదల చేసింది. ఎక్స్ సిరీస్‌లో వస్తున్న ఈ ప్రీమియం 5జీ ఫోన్ల ప్రీ బుకింగ్ ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మే 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల ద్వారా ప్రీ బుక్ చేసుకుంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
వివో ఎక్స్90 ప్రో స్పెసిఫికేషన్స్ (Vivo X90 Pro)
వివో ఎక్స్90 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.78 అంగుళాల అమోలెడ్ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేకంగా త్రీ లెవల్ ఐ ప్రొటెక్షన్ ఇచ్చారు. జెయిస్‌తో (Zeiss) కలిసి అభివృద్ధి చేసిన సోనీ ఐఎంఎక్స్ 989 సెన్సర్‌ను 50 ఎంపీ ప్రధాన కెమెరాగా వినియోగించారు. దీంతో పాటు 12 ఎంపీ టెలీఫోటో, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాలు ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చారు. మీడియాటెక్ డిమెన్‌సిటీ 9200 ప్రాసెసర్‌ను అమర్చారు. 4,870mAh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం ఎనిమిది నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ+256 జీబీతో వస్తోంది. కేవలం నలుపు రంగులో మాత్రమే లభించే ఈ మొబైల్ ధర రూ.84,999గా వివో నిర్ణయించింది. ఇది లెదర్ కేస్‌తో వస్తోంది.
వివో ఎక్స్90 ఫీచర్లు (Vivo X90)
వివో ఎక్స్90 ప్రో మాదిరిగానే ఇందులోనూ సాఫ్ట్‌వేర్, డిస్‌ప్లే పరంగా దాదాపు అవే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సోనీ ఐఎంఎక్స్ 866 సెన్సర్‌ను 50 ఎంపీ ప్రధాన కెమెరాగా వినియోగించారు. 12 ఎంపీ టెలీ ఫోటో, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీకోసం 32 ఎంపీ కెమెరాను ఇచ్చారు. దుమ్ము, నీరు చేరకుండా IP64 రేటింగ్ ప్రొటక్షన్‌ను ఇస్తున్నారు. ఈ మొబైల్‌కు 4,810mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. నలుపు, నీలం రంగుల్లో వివో ఎక్స్90 అందుబాటులో రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు రెండు వేరియంట్లలో వస్తున్నాయి. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.59,999గా, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.63,999గా కంపెనీ నిర్ణయించింది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్డేట్లను ఇవ్వనున్నట్లు వివో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kuppam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో భారీ ర్యాలీ
-
LPG prices: వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారం.. రూ.209 పెంపు
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Gautham Menon: ‘లియో’.. మైండ్ బ్లోయింగ్ మూవీ: గౌతమ్ మేనన్
-
glasgow: ఖలిస్థానీల తీరును ఖండించిన గ్లాస్గో గురుద్వారా..!