Accident: పోలీసు సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా.. 38మందికి గాయాలు!

గుజరాత్‌లో స్టేట్‌ రిజర్వు పోలీసులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో 38మందికి గాయాలయ్యాయి.

Published : 30 Oct 2023 22:24 IST

హాలోల్‌: గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లాలో రిజర్వు పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.  హాలోల్‌ సమీపంలో పర్వత ప్రాంతంలో బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 38మంది స్టేట్‌ రిజర్వ్‌ పోలీసులు (SRP)గాయపడ్డారు. వీరిలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్సు బ్రేకులు ఫెయిల్‌ అయ్యి,  డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడినట్లు సమాచారం. పవాగఢ్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఫైరింగ్‌ శిక్షణను పూర్తి చేసుకొని దాహోడ్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

‘‘ప్రమాదం సమయంలో బస్సులో 50 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. 38 మందికి గాయాలయ్యాయి. వీరందరినీ హాలోల్‌ లోని ఆస్పత్రికి తరలించాం. వీరిలో 29మంది ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా.. తొమ్మిది మందికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం వడోదరలోని ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యులు సిఫారసు చేశారు’’ అని  పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఏ జడేజా మీడియాకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని