హాథ్రస్‌ కేసు: ఉన్నతాధికారులకు సమన్లు

అలహాబాద్‌ హైకోర్టు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది..

Published : 03 Oct 2020 01:18 IST

విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించిన అలహాబాద్‌ హైకోర్టు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువతి మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పోలీసుల చర్యపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అలహాబాద్‌ హైకోర్టు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. న్యాయమూర్తులు రాజన్‌రాయ్‌, జస్ప్రీత్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం‌ యూపీ అదనపు చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, ఏడీజీపీకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్‌ 12న కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఈ ఘటనను సుమోటాగా తీసుకున్న కోర్టు మరికొందరికి కూడా సమన్లు పంపింది. హాథ్రస్‌ జిల్లా కలెక్టర్‌, సీనియర్‌ పోలీసు సూపరింటెండెండ్‌లను కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.

కుటుంబసభ్యుల అనుమతి లేకండా అర్ధరాత్రి యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది. అత్యాచార కేసు దర్యాప్తులో తాజా స్థితిని తెలియజేయాల్సిందిగా కోర్టు అధికారులను ఆదేశించింది. న్యాయస్థానానికి వచ్చి తమ వాదనలు వినిపించాల్సిందిగా యువతి తల్లిదండ్రులను కోరింది. వారు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని